ఒక వ్యక్తి జీవితంపై ఇంత పెద్ద పుస్తకమా? ప్రాముఖ్ స్వామి జీవిత చరిత్రకు ప్రపంచ రికార్డు! | | ACTPnews

Pramukh Swami Maharaj


Last Updated:

వందలు కాదు.. వేలు పేజీలు కాదు.. ఏకంగా 8,848 పేజీలు, 21 లక్షలకు పైగా పదాలు! ప్రాముఖ్ స్వామి మహరాజ్ 94 ఏళ్ల జీవితం, ఆధ్యాత్మిక సేవ, మానవతా కార్యక్రమాలను 13 సంపుటాలుగా నమోదు చేసిన ఈ భారీ జీవిత చరిత్ర ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించింది.

Pramukh Swami Maharaj
Pramukh Swami Maharaj

Pramukh Swami Maharaj: ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన ఘనత నమోదైంది. బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రాముఖ్ స్వామి మహరాజ్ జీవితంపై రూపొందించిన 13 సంపుటాల జీవిత చరిత్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు లభించింది. మొత్తం 8,848 పేజీలు, 2,146,447 పదాలతో రూపొందిన ఈ రచన.. ఒకే రచయిత రాసిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన జీవిత చరిత్రగా రికార్డు సృష్టించింది.

94 ఏళ్ల జీవితం.. సంపూర్ణ నమోదు

‘బ్రహ్మస్వరూప్ ప్రాముఖ్ స్వామి మహరాజ్: విస్తృత్ జీవన్ అనే కార్య’ పేరుతో ఈ జీవిత చరిత్రను సంస్కృత పండితుడు సాధు ఆదర్శజీవన్‌దాస్, పీహెచ్‌డీ రచించారు. 1921 నుంచి 2016 వరకు 94 ఏళ్ల పాటు సాగిన ప్రాముఖ్ స్వామి మహరాజ్ జీవితాన్ని ఈ 13 సంపుటాలు విపులంగా నమోదు చేశాయి. ఆయన ఆధ్యాత్మిక నాయకత్వం, వినయం, భక్తి, నిస్వార్థ సేవతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సమాజాలను ప్రేరేపించిన విధానాన్ని ఇందులో పొందుపరిచారు. ఈ విస్తృత పరిశోధన, రచనా ప్రక్రియ జూలై 2017 నుంచి ఆగస్టు 2020 వరకు 38 నెలల పాటు కొనసాగింది.

11 వేల మంది సమక్షంలో రికార్డు

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని మహంత్ స్వామి మహరాజ్‌కు అక్టోబర్ 4, 2026 ఆదివారం లండన్‌లోని ఓవో అరేనా వెంబ్లీలో అందజేశారు. ఆయన 93వ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి అరేనాలో 11,000 మంది హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మరో పదివేల మంది లైవ్ వెబ్‌కాస్ట్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. గిన్నిస్ సీనియర్ అడ్జుడికేటర్ కార్ల్ సవిల్ ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

రచయిత ఏమన్నారు?

ఈ జీవిత చరిత్ర రచయిత సాధు ఆదర్శజీవన్‌దాస్ మాట్లాడుతూ, పుస్తక రచయిత కంటే దాని ప్రధాన అంశమైన ప్రాముఖ్ స్వామి మహరాజ్ జీవితం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, అపారమైన వినయం, ప్రపంచ శాంతి, కరుణ, మానవత కోసం ఆయన చేసిన కృషిని నమోదు చేయడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ సంపుటాలకు సంబంధించిన 3,10,000కు పైగా ప్రతులు విక్రయమయ్యాయి.

మరో గిన్నిస్ రికార్డు కూడా

బీఏపీఎస్ సంస్థకు గిన్నిస్ గుర్తింపు రావడం ఇదే తొలిసారి కాదు. 2026 ఫిబ్రవరిలో భారతదేశంలోని వడోదరలో 12,723 మంది పిల్లలు ఒకేసారి ‘సత్సంగ్ దీక్ష’లోని సంస్కృత శ్లోకాలను పఠించి రికార్డు సృష్టించారు. ఇది అత్యధిక మంది ఒకేసారి హిందూ గ్రంథ పఠనం చేసిన రికార్డుగా నమోదైంది. ఈ కార్యక్రమం కోసం 15,000 మందికి పైగా పిల్లలు మొత్తం 315 సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసుకున్నారు.

1921–2016 మధ్య జీవించిన ప్రాముఖ్ స్వామి మహరాజ్ భగవాన్ స్వామినారాయణ్ ఐదో ఆధ్యాత్మిక వారసుడిగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. “ఇతరుల ఆనందంలోనే మన ఆనందం ఉంది” అనే సందేశంతో ప్రేమ, శాంతి, సామరస్యం, ధర్మం, భగవంతుడిపై విశ్వాసం వంటి విలువలను ప్రచారం చేశారు. ఆయన నాయకత్వంలో బీఏపీఎస్ సంస్థ అంతర్జాతీయ ఆధ్యాత్మిక, మానవతా సంస్థగా ఎదిగి, 10 లక్షలకు పైగా సభ్యులు, 80,000 మంది స్వచ్ఛంద సేవకులు, ప్రపంచవ్యాప్తంగా 5,025 కేంద్రాలతో విస్తరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed