Minapa Vadalu: నూనె పీల్చకుండా కరకరలాడే మినప వడలు.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Minapa Vadalu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా మెత్తగా, గుల్లగా ఉండే మినప గారెలు చేయడం చాలామందికి సవాలే. పిండి రుబ్బే విధానం, నీటి పరిమాణం, నూనె వేడి వంటి చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు చేస్తే వడలు నూనె పీల్చుకోవడం లేదా గట్టిగా మారడం జరుగుతుంది. మరి నూనె తక్కువగా పీల్చుకుని పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా, సాఫ్ట్‌గా రావాలంటే పాటించాల్సిన వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందాం.

News18
News18

Minapa Vadalu: తెలుగువారి పండుగలు, శుభకార్యాలు లేదా ఉదయపు అల్పాహారంలో వేడివేడి మినప గారెల (వడలు) స్థానమే వేరని గృహిణి వరలక్ష్మి వివరిస్తున్నారు. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో గారెలను నంజుకుని తింటుంటే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇంట్లో గారెలు చేసేటప్పుడు చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య.. అవి విపరీతంగా నూనె పీల్చుకోవడం లేదా గట్టిగా రాతిలా మారడం. పిండి సరిగ్గా రుబ్బకపోవడం, నీళ్లు ఎక్కువ కావడం వల్లే ఇలా జరుగుతుందని తెలుపుతున్నారు. నూనె చుక్క కూడా పీల్చకుండా బయట క్రిస్పీగా, లోపల స్పాంజ్‌లా గుల్లగా రావడానికి పాటించాల్సిన ఆ 5 పక్కా వంటింటి మెలకువల పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు…

పొట్టులేని మినప్పప్పు: 1 కప్పు

పచ్చిమిరపకాయలు: 2-3 (సన్నగా తరిగినవి)

అల్లం తరుగు: 1 చిన్న చెంచా (సన్నగా తరిగినది)

జీలకర్ర: 1 చిన్న చెంచా

ఉల్లిపాయ: 1 చిన్నది (సన్నగా తరిగినది – ఐచ్ఛికం)

కరివేపాకు: 2 రెమ్మలు (సన్నగా తరిగినవి)

కొత్తిమీర తరుగు: 2 పెద్ద చెంచాలు

మిరియాలు: అర చిన్న చెంచా (కచ్చాపచ్చాగా దంచినవి)

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం…

మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టండి. నానిన పప్పులో నీటిని పూర్తిగా వడకట్టండి. గ్రైండర్ లేదా మిక్సీ జార్‌లో పప్పును వేసి, అవసరమైతే కేవలం 2-3 చెంచాల చల్లటి నీళ్లు మాత్రమే చిలకరిస్తూ రుబ్బుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా, మెత్తగా మరియు గట్టిగా ఉండాలి. పిండిని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుని, చేతితో ఒకే దిశలో 3-4 నిమిషాల పాటు వేగంగా బాగా కలపండి. పిండి సరిగ్గా వచ్చిందో లేదో చూడటానికి ఒక గిన్నె నీటిలో కొద్దిగా పిండి వేస్తే అది తేలాలి. ఇప్పుడు ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపండి.

వడలు వేయడం…

బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయండి. ఒక చేతిని లేదా ప్లాస్టిక్ కవర్/అరిటాకును నీటితో తడి చేసుకోండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకుని గుండ్రంగా చేసి, మధ్యలో వేలితో చిన్న రంధ్రం చేయండి. నెమ్మదిగా వేడి నూనెలో జారవిడవండి. బాణలి పరిమాణాన్ని బట్టి ఒకేసారి 4-5 వడలు వేయండి. మంటను మీడియంలోనే ఉంచి, రెండు వైపులా తిప్పుతూ మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చేవరకు వేయించి తీయండి. వేడివేడి మినప వడలను అల్లం పచ్చడి, పల్లీ కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌‌తో వడ్డిస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports