Jana Nayagan: జన నాయగన్ నటి కన్నీరుమున్నీరు.. ఏడాది కష్టం, చివరకు ఇలా అయ్యిందంటూ ఆవేదన | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

దళపతి విజయ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఆనంది అనే నాటికీ దక్కింది. కానీ, చివరి నిమిషంలో ఆమె సీన్లు కట్ చేశారని, తన కష్టం, ఆశలపై నీళ్లు జల్లారని ఆనంది ఆవేదన చెందుతోంది.

News18
News18

స్టార్ హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్ దొరికినా తమ అదృష్టంగా భావిస్తారు కొత్త నటీనటులు. అందులోనూ పాన్ ఇండియా రేంజ్ ఉన్న సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని, ఏళ్ల తరబడి కలలు కని, ఏడాది పాటు ప్రాణం పెట్టి కష్టపడిన తర్వాత.. చివరి నిమిషంలో ఆ పాత్రను సినిమా నుంచే పూర్తిగా తొలగిస్తే ఆ బాధను మాటల్లో వర్ణించడం కష్టం. సరిగ్గా ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితినే ఎదుర్కొంటూ తీవ్ర వేదన అనుభవిస్తున్నారు ప్రముఖ తమిళ నటి, బుల్లితెర తార ఆనంది అజయ్.

దళపతి విజయ్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఆనందికి దక్కింది. కానీ, ఎడిటింగ్ టేబుల్ వద్ద ఫైనల్ కట్‌లో ఆమె నటించిన సన్నివేశాలను మేకర్స్ తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఆనంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన ఆవేదనను పంచుకుంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కన్నీటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. “ఈ సినిమా కోసం నేను సుమారు ఏడాది పాటు ఎంతో అంకితభావంతో పనిచేశాను. విజయ్ సార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. కానీ ఇప్పుడు నా సన్నివేశాలను తొలగించడం నన్ను మానసికంగా తీవ్రంగా కుంగదీస్తోంది” అని ఆనంది కన్నీరుమున్నీరయ్యారు.

విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నందున, బహుశా నటుడిగా ఆయనకు ఇదే చివరి సినిమా కావొచ్చన్న బలమైన ప్రచారం జరుగుతోంది. ఇలాంటి చారిత్రాత్మక ప్రాజెక్టులో భాగమైనా, తెరపై కనిపించే అదృష్టం దక్కకపోవడం.. ఇక భవిష్యత్తులో ఆయనతో నటించే ఛాన్స్ బహుశా రాకపోవచ్చన్న నిజం ఆమెను మరింత బాధిస్తోంది. అయితే ఆనందికి నెటిజన్ల నుంచి, అభిమానుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. “మీ బాధను మేము అర్థం చేసుకోగలం, ధైర్యంగా ఉండండి. ప్రతిదీ ఒక మంచి కారణం కోసమే జరుగుతుంది, ఇంతకంటే గొప్ప ప్రధాన పాత్ర త్వరలోనే వస్తుంది” అంటూ నెటిజన్లు ఆమెకు భరోసా ఇస్తున్నారు.

ఆనంది అజయ్ తమిళ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ‘కార్తిగై పెంగళ్’, ‘యమునా’, ‘కనా కానుమ్ కాలంగళ్’ వంటి పాపులర్ సీరియల్స్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ‘డ్యాన్స్ జోడీ డ్యాన్స్ 3.0’, ‘జోడీ నెం.1’ రియాలిటీ షోల ద్వారా బెస్ట్ డ్యాన్సర్‌గానూ తన సత్తా నిరూపించుకున్నారు. క్లాసికల్ డ్యాన్సర్, యోగా నిపుణురాలిగా బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆనందికి.. ఈ తాజా పరిణామం వృత్తిపరంగా తీవ్ర నిరాశను మిగిల్చినా, ప్రేక్షకుల అండ ఆమెకు ఊరటనిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports