Jangaa: రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా త్రిగుణ్.. జంగా మోషన్ పోస్టర్ వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వెండితెరపై ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపించనున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా జంగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

News18
News18

శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

రీసెంట్ గా త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ నుంచి పోస్టర్ & మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులోని విజువల్స్, సౌండింగ్, హీరో లుక్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇంత వరకు లవర్ బాయ్‌లా కనిపించిన త్రిగుణ్ ఈ సారి రా అండ్ రస్టిక్ లుక్‌లో మాసీగా కనిపిస్తున్నారు. కెరీర్‌లోనే డిఫరెంట్ సబ్జెక్ట్, పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని ఆకట్టుకోనున్నారు.

ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్రిగుణ్, నేహా పఠాన్, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్,భూపాల్ రాజు , రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *