Pawan Kalyan | సార్… ఇక్కడే ఆ ఘోరం.. కాలి బూడిదయ్యారు | ACTPnews

Pawan Kalyan | సార్... ఇక్కడే ఆ ఘోరం.. కాలి బూడిదయ్యారు



విశాఖ ఉక్కు కర్మాగారంలో (RINL) జరిగిన అత్యంత ఘోరమైన ద్రవ ఉక్కు లాడిల్ పేలుడు ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 33 ఏళ్లలో ఇలాంటి విపత్తు ఎప్పుడూ జరగలేదని, ప్రపంచంలోనే ఇది అత్యంత అరుదైన ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి రూ. 45.75 లక్షల భారీ పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్ లైవ్ ప్రెస్ మీట్ ఇక్కడ చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports