Women’s T20 World Cup 2026: అచ్చం పురుషుల జట్టు లాగే.. పసికూన చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్తాన్.. ప్రపంచకప్ కాదు కదా గల్లీ కప్పు కూడా గెలవలేరు | క్రీడా వార్తలు | ACTPnews

పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్


Last Updated:

డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తన రెండవ, చివరి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో (డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం) పరాజయం పాలైంది. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో పాక్‌ను చిత్తు చేసింది.

పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్
పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్

Women’s T20 World Cup 2026: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 ప్రధాన టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ మహిళల జట్టుకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మంగళవారం డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తన రెండవ, చివరి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో (డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం) పరాజయం పాలైంది. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో పాక్‌ను చిత్తు చేసింది.

ఉతికేసిన స్కాట్లాండ్ కెప్టెన్ కేథరిన్ బ్రైస్!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట స్కాట్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. స్కాట్లాండ్ ఓపెనర్ డార్సీ కార్టర్ (36 బంతుల్లో 45 పరుగులు) జట్టుకు బలమైన ఇన్నింగ్స్ అందించింది. ఆమె మరో ఓపెనర్ కేథరిన్ ఫ్రేజర్‌ (19)తో కలిసి మొదటి వికెట్‌కు 6 ఓవర్లలోనే 41 పరుగులు జోడించింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కాట్లాండ్ కెప్టెన్ కేథరిన్ బ్రైస్ (Kathryn Bryce) మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించింది. కేవలం 43 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృప్తిగా సెంచరీ చేజార్చుకుంది. ఆమె మెరుపు ఇన్నింగ్స్ కారణంగా స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీసినప్పటికీ, ఫీల్డర్ల పేలవమైన ప్రదర్శన కారణంగా బ్రైస్‌ను అడ్డుకోలేకపోయారు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆమె రనౌట్ అయింది.

కుప్పకూలిన పాక్ బ్యాటింగ్.. వర్షం అంతరాయం

192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు ఆరంభంలోనే చేతులెత్తేసింది. మొదటి ఐదు ఓవర్లలోనే గుల్ ఫెరోజా, సైరా జబీన్, ఆయేషా జాఫర్ వంటి కీలక వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. స్కాట్లాండ్ బౌలర్ రాచెల్ స్లేటర్ తన రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. 9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో హఠాత్తుగా కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేసి, డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం స్కాట్లాండ్‌ను 41 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.

భారత్‌తో ఆదివారం హై-వోల్టేజ్ పోరు!

తమ మొదటి వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్‌కు, ఇది వరుసగా రెండవ పరాజయం. ఈ ఆదివారం (జూన్ 14న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సాంప్రదాయ ప్రత్యర్థి భారత్‌తో జరగబోయే తమ తొలి ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌కు ముందు ఈ వరుస ఓటములు పాక్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.

మరోవైపు, ఉత్సాహంలో ఉన్న స్కాట్లాండ్ జట్టు జూన్ 13న ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్-ఎ లో భారత్, పాకిస్తాన్‌లతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బి లో ఆతిథ్య ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. కాగా, ఈ మెగా టోర్నమెంట్ శుక్రవారం బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్‌తో అధికారికంగా ప్రారంభం కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *