Jayalalitha: గుమ్మడితో సంబంధం అంటగట్టారు, ఆయన చనిపోయాక నాగేశ్వర్ రావు మాటలు మర్చిపోలేను | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అలనాటి తెలుగు నటి జయలలిత, తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత తన వ్యక్తిగత జీవితం, దివంగత లెజెండరీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో తనకున్న అనుబంధంపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

News18
News18

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న అలనాటి నటి జయలలిత, ప్రేక్షకులకు ‘బోరింగ్ పాప’గా సుపరిచితురాలు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో, ముఖ్యంగా వ్యాంప్, నెగెటివ్ ఛాయలున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు. దశాబ్దాల పాటు వెండితెరపై మెరిసిన ఆమె, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి టీవీ ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. అయితే, గత కొంతకాలంగా ఆమె సినిమాలకు, సీరియల్స్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి కెమెరాకు దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత తన వ్యక్తిగత జీవితం, దివంగత లెజెండరీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావుతో తనకున్న అనుబంధంపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అప్పట్లో తనను, సీనియర్ నటుడు గుమ్మడిని కలుపుతూ ఇండస్ట్రీలో అనేక పుకార్లు షికార్లు చేశాయని, అవి తనను ఎంతగానో బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “గుమ్మడి గారు నాకు తండ్రితో సమానం. మా మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని, అవాస్తవాలు సృష్టించి సంబంధం అంటగట్టారు” అని ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. గుమ్మడితో తనకున్న వాస్తవ అనుబంధాన్ని వివరిస్తూ.. “ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, ఏం వండుతున్నావ్? అని ఎంతో ఆప్యాయంగా అడిగేవారు. మేమంతా కలిసి భోజనం చేసేవాళ్లం, సరదాగా పేకాట ఆడేవాళ్లం. అదంతా నా అదృష్టంగా భావించేదాన్ని. నా కోసం ఆయన ప్రత్యేకంగా ఓ వైన్ బాటిల్ కూడా తెప్పించేవారు. నాకు పరిచయమైన తర్వాత ఆయన బయట క్లబ్‌కు వెళ్లడం కూడా పూర్తిగా మానేశారు” అని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

గుమ్మడితో నాలుగేళ్ల పాటు తన ప్రయాణం కొనసాగిందని, ఆయన చివరి రోజుల్లో కూడా దగ్గరుండి చూసుకున్నానని జయలలిత వెల్లడించారు. “ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు స్వయంగా ఆసుపత్రిలో చేర్పించింది నేనే. ఆయన తుదిశ్వాస విడిచే సమయంలో ఆయన పక్కనే ఉన్నాను. గుమ్మడి గారు మరణించిన తర్వాత దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నాతో మాట్లాడుతూ.. ‘గుమ్మడి పోవడం నీకు చాలా పెద్ద మైనస్’ అని నన్ను ఓదార్చారు. ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. ఇప్పుడు ఎప్పుడైనా ఆయన ఇంటి వైపు వెళ్తుంటే ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుపు వస్తుంది” అంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇక వయసు, వ్యక్తిగత ప్రశాంతత కోసం సీరియల్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లు జయలలిత స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed