తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సుమారు రూ.1,000 కోట్ల మేర భారీ దోపిడీకి పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ భారీ కుంభకోణాన్ని తాము సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మిల్లర్ల మాయాజాలం వల్ల క్వింటాల్‌కు రూ.120 నుండి రూ.250 వరకు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని ధర్మకాంటా తూకాలను (వే బ్రిడ్జ్ రికార్డులను) పరిశీలిస్తే వాస్తవాలన్నీ బయటపడతాయని చెబుతూ.. ప్రభుత్వం తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Source link
Jeevan Reddy : ధాన్యం కొనుగోళ్లలో రూ.1,000 కోట్ల దోపిడీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










