Last Updated:
Viral Video: దేవాలయాలను పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు భక్తులు. ఆలయం వెలుపలే చెప్పులు వదిలి.. బొట్టు పెట్టుకొని, సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయంలోని దేవుడ్ని దర్శించుకుంటారు. జూన్ 5న మధ్యప్రదేశ్ ఉజ్జాయిన్లోని మహాకాల్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పుష్ప గెటప్‌లో ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఏమైందో చూడండి.
Ujjain Mahakal Temple: మనదేశంలో ఏ పవిత్రక్షేత్రానికి వెళ్లినా.. ఏ హిందూ దేవాలయాన్ని సందర్శించాలన్న సంప్రదాయ పద్దతిలో సాధారణ భక్తుల్లాగానే ఆలయాల్లోకి ప్రవేశించడం ఆనవాయితీ. దీనికి వీఐపీలు సైతం అతీతం కాదు. అంతే కాదు ప్రముఖ ఆలయాల్లో సెల్ఫోన్ల నిషేధం కూడా అమల్లో ఉంది. ఉదాహరణకు ఏపీలోని తిరుమల వెంకటేశ్వరస్వామి టెంపుల్, మహారాష్ట్రలోని షిర్టీ సాయిబాబా ఆలయం, కర్నాటకలోని ధర్మస్తలలోని మంజునాథ టెంపుల్ మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ద ఆలయం మహాకాల్ ఆలయంలో కూడా ఇదే నిబందనలు అమల్లో ఉన్నాయి. గుడిలోకి అడుగుపెట్టగానే ఏ భక్తుడికైనా మనసు పవిత్రంగా, ఆధ్యాత్మిక చింతనతో నిండుకొని ఉంటుంది. కాని తాజాగా ఉజ్జయిన్‌లోని మహాకాల్ ఆలయానికి పుష్ప వచ్చాడు. పుష్ప అంటే అల్లు అర్జున్ కాదు.. అచ్చూ సినిమాలో పుష్ప వేషాధారణ వేసుకొని ప్రధాన ఆలయంలో వీఐపీ దారిలో హీరో మేనరిజం ప్రదర్శిస్తూ భక్తులు, ఆలయ సిబ్బందిని పలకరిస్తూ సరదాగా రీల్స్ చేసే లొకేషన్‌కి వచ్చినట్లుగా ఫోజులు ఇచ్చాడు. సినిమాలో హీరో గెటప్‌తో ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డుకోవాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని చూసి మురిసిపోయారు. రియల్ హీరోని కలిసినట్లుగా అతనితో సెల్ఫీలు దిగడం, సరదాగా మాట్లాడారు. మహాకాల్ ఆలయంలో పుష్ప రాకను చూసి ఆలయ,సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామా చూసి సామాన్య భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆలయ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పుష్ప వేషం వేసుకొచ్చిన యువకుడ్ని అరెస్ట్ చేయడమే కాకుండా.. ఆలయంలోకి అనుమతించిన సూపర్వైజర్ను ఉద్యోగం నుండి తొలగించారు. మహాకాల్ ఆలయ నిర్వాహకుడు ప్రథమ్ కౌశిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈఘటన ఈనెల 5వ తేది జరిగితే.. మూడ్రోజులకు చర్యలు తీసుకున్నారు.
దేవాలయాలను పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు భక్తులు. ఆలయం వెలుపలే చెప్పులు వదిలి.. బొట్టు పెట్టుకొని, సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయంలోని దేవుడ్ని దర్శించుకుంటారు. అయితే నాలుగు రోజుల క్రితం అంటే జూన్ 5వ తేదిన మధ్యప్రదేశ్ ఉజ్జాయిన్లోని మహాకాల్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది సాధారణ భక్తుల మధ్య ఓ యువకుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న గెటప్‌తో గర్భాలయంలోకి ప్రవేశించి అందర్ని షాక్‌కి గురి చేశాడు. చీర, జాకెట్, కాళ్లకు గజ్జెలు, చేతులకు గాజులు, మెడలో నిమ్మకాయల దండ, నెక్లెస్, చెవిపోగులు, ముక్కుపుడక ధరించాడు. ధరించి వీఐపీ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే కాదు తాను టెంపుల్‌లోకి వచ్చింది అమ్మవారిని దర్శించుకునేందుకు కాదని.. రీల్ వీడియో కోసమని అక్కడున్న ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు గమనించలేకపోయారు. సాధారణంగా భక్తులు సెల్ఫోన్లనే టెంపుల్‌లోకి అనుమతించరు. కాని పుష్ప గెటప్‌తో టెంపుల్‌లోకి వచ్చిన యువకుడ్ని చూసి సిబ్బంది ఫోటోలు దిగారు. సెల్ఫీల కోసం ఎదబడ్డారు.
భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పుష్ప గెటప్‌లో మహాకాల్ ఆలయంలోకి వచ్చిన యువకుడి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. మహాకాల్ ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇప్పటికే నిషేధించబడినప్పటికీ, భద్రతా సిబ్బంది , ఆలయ కమిటీ సభ్యులు ఆ యువకుడిని ఆపలేదు సరికదా అతడిని వీఐపీ దర్శనమార్గంలో గణేష్ మండపం దర్శనానికి తోడ్కొని వెళ్ళాడు. అటుపై అతనితో ఫోటోలు కూడా తీసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీని పర్యవేక్షించాల్సిన బాధ్యత సిబ్బంది, భద్రతా సిబ్బందిపై కూడా ఉంది. వాటిని సరిగా అమలు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో సెక్యూరిటీ సూపర్ వైజర్ని ఉద్యోగం నుంచి తొలగించారు. వైరల్ అయిన వీడియోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నామని మహాకాల్ ఆలయ నిర్వాహకుడు ప్రథమ్ కౌశిక్ మీడియాకు వెల్లడించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అమ్మవారి పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిబంధనలు అమలు చేస్తామని వెల్లడించారు.
మహాకాల్ టెంపుల్లో పుష్ప గెటప్‌లో యువకుడు హల్చల్ చేసిన వీడియోని అంకిత్ అస్తోలియా అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతా నుండి అప్లోడ్ చేయబడ్డాయి. అయితే మహాకాల్ ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్ అలియాస్ పుష్పగా గుర్తించారు. నేపాల్ సరిహద్దులో ఎస్టిఎఫ్ అతడ్ని అరెస్టు చేసింది. అంతే కాదు వీడియోలు షేర్ చేసిన అభిషేక్ బెనర్జీకి పుష్ప రైట్ హ్యాండ్‌గా పోలీసులు తేల్చారు.
Ujjain,Ujjain,Madhya Pradesh












