Samantha: మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ.. ఈ బంగారానికి డిమాండ్ దక్కేనా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సమంత కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ ఫీలింగ్స్ చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..

News18
News18

సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రం నేడు అనగా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన సమంత.. ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడంలో కీలక పాత్ర వహించింది.

చాలా గ్యాప్ తర్వాత సమంత లీడ్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ సైకోలాజికల్ క్రైమ్ అండ్ రివెంజ్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మా ఇంటి బంగారం ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూస్తే..

సినిమా ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు ఆడియన్స్. ఈ భాగంలో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, పక్కా లోకల్ హ్యూమర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయట. ఫస్టాఫ్ అంతా కూడా చాలా వేగంగా సాగిపోయిందని, ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలవడం ఖాయమని కొందరు పేర్కొంటున్నారు. ఇకపోతే సెకండాఫ్ కాస్త స్లోగా రన్ అయినప్పటికీ, ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిందని చెబుతున్నారు.

ద్వితీయార్థంలో చూపించిన సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ డోస్ కాస్త ఎక్కువైనప్పటికీ, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబడుతుందని అంటున్నారు. సమంత చేసే భారీ ఫైట్లు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ సినిమారేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిందని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో ఎంగేజింగ్ మూమెంట్స్ పెద్ద అట్రాక్షన్ కాలేదు కానీ, సమంత మాత్రం తన రోల్ ను బాగా ప్లే చేసిందని పేర్కొంటున్నారు. ఇది సమంత పక్కా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ సినిమా అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. సో, చూడాలి మరి ఈ టాక్ నడుమ సమంత హిట్ సాధిస్తుందా? లేదా అనేది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports