Last Updated:
నిన్న ఎన్టీఆర్ భుజానికి హైదరాబాద్‌లో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో అర్థ్రోస్కోపిక్ సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. కాగా.. తాజాగా తారక్‌కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. సర్జరీ అనంతరం వైద్యుల బృందంలో కలిసి ఎన్టీఆర్ ఫోటో దిగాడు.
నిన్న ఎన్టీఆర్ భుజానికి హైదరాబాద్‌లో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో అర్థ్రోస్కోపిక్ సర్జరీ సక్సెస్ ఫుల్‌గా జరిగింది. కాగా.. తాజాగా తారక్‌కు సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చింది. సర్జరీ అనంతరం వైద్యుల బృందంలో కలిసి ఎన్టీఆర్ ఫోటో దిగాడు. ఇందులో తారక్ చేతికి బెల్డ్ వేసుకుని కనిపించారు. అంతేకాకుండా ఫోటోలో చిరునవ్వుతో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి రావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.














