Jr NTR Dragon: సినీ సర్కిల్స్‌లో ఒక్కసారిగా డ్రాగన్ ట్రెండ్.. ఈ విషయంలో మాత్రం నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారబ్బా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ సినిమా డ్రాగన్. ఓ పక్క సినీ వర్గాల్లో ఈ సినిమా ట్రెండ్ నడుస్తుండగా మరోపక్క ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే న్యూస్ వైరల్ అవుతోంది.

News18
News18

మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (Dragon). బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఓ రేంజ్ మేనియాను సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ నుంచి ఒకింత నిరాశ కలిగించే విషయం కంటపడింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన ‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) తరహాలోనే ఈ ‘డ్రాగన్’ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాలీవుడ్, బాలీవుడ్ ఆడియెన్స్ గట్టిగా భావించారు. సాధారణంగా ప్రశాంత్ నీల్ తన సినిమాలను ఫ్రాంచైజీలుగా ప్లాన్ చేస్తే, ఆ విషయాన్ని టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలోనే స్పష్టం చేస్తారు. కానీ, ‘డ్రాగన్’ విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం ఒకే ఒక్క భాగంగా (Single Film) రాబోతుందని క్లియర్ అవుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై-వోల్టేజ్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే పార్ట్‌తో ముగిసిపోనుండటం ఫ్యాన్స్‌ను కొద్దిగా డిజప్పాయింట్ చేస్తోందట. అయితే, డ్రాగన్ రెండు పార్టులుగా వచ్చే ఛాన్స్ లేకపోలేదని, థియేటర్లలో విడుదలయ్యాక సినిమా చివర్లో పార్ట్ 2 కి సంబంధించిన ఏదైనా హింట్ లేదా లీడ్ ఇస్తారేమో అని కొందరు భావిస్తున్నారు.

“ప్రశాంత్ నీల్ సినిమాలు అంటేనే భారీ లార్జర్ ద్యాన్ లైఫ్ యాక్షన్ డ్రామా. ‘డ్రాగన్’ ఒకే భాగంగా వస్తున్నప్పటికీ.. అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఉండబోతోంది.” ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మరియు ‘దేవర’ (Devara) చిత్రాల విజయాల తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ప్రశాంత్ నీల్‌కు ఉన్న పాన్-ఇండియా క్రేజ్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తోడైతే ‘డ్రాగన్’ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించే సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా నేడు (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports