Last Updated:
Supreme Court: సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు.
కులగణనపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. జనగణనలో కులాల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కులగణన ప్రభుత్వ పరమైన నిర్ణయం, విధానపరమైన నిర్ణయం అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఈ నిర్ణయం విషయంలో కోర్టుల జోక్యం ఉండదు అన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అన్న జస్టిస్ సూర్యకాంత్.. కులగణన ద్వారానే.. దేశంలో పేదలు ఎంత మంది ఉన్నారో, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుస్తుంది అని అన్నారు. కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇదో సంచలనమైన తీర్పుగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరూ కేంద్రం కులగణన కూడా చేపట్టడమేంటి అని కొంతమంది వ్యత్తిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ తీర్పుతో కేంద్రానికి భారీ ఊరట లభించినట్లే. ఇప్పుడు కేంద్రం జనగణనలో కులగణన కూడా చేపట్టి తీరుతుంది.
కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో జనాభా గణన చేపడుతోంది. ఇందులోనే కులాల వారీ లెక్కలు కూడా తీసుకుంటోంది. ఇలాంటిది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. అందువల్ల తెలంగాణలో ఇప్పటికే కులాల వారీ లెక్కలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ఆ లెక్కలపై స్పష్టత లేదు. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత.. కేంద్రం సమగ్రంగా వివరాలు సేకరించి.. తద్వారా.. సంక్షేమ పథకాల అమలులో తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 20, 2026 11:41 AM IST













