మొత్తానికి ఈ వారం కార్తీకదీపం 2 సీరియల్ దీప విజయాలు, జ్యోత్స్న పరాజయాల చుట్టూ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. సీఈఓ హోదాలో దీప, కార్తీక్ కలిసి జ్యోత్స్నకు తగిన గుణపాఠాలు చెబుతుంటే ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే, కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి సూరజ్ చుట్టూ కొత్త ముడి పడింది. శివన్నారాయణకు బద్ధ శత్రువైన దక్షిణామూర్తి బిజినెస్ పరంగా సవాల్ విసరడమే కాకుండా, సూరజ్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం కథను సరికొత్త మలుపు తిప్పింది. మరి సూరజ్ నిజంగానే దక్షిణామూర్తి మనిషా? లేక జ్యోత్స్న, పారిజాతంల కుట్రల వల్ల అలా ఇరుక్కుపోయాడా? అన్న అనుమానాలతో ఈ వారం ఎపిసోడ్లు ముగిశాయి. వచ్చే వారం సూరజ్ తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటాడో చూడాలి.













