Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం.. కొత్త పార్టీ ప్రకటిస్తామన్న కవిత.. ఆ తేదీనే పార్టీ పేరు ప్రకటన | తెలంగాణ వార్తలు | ACTPnews

Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం.. కొత్త పార్టీ ప్రకటిస్తామన్న కవిత.. ఆ తేదీనే పార్టీ పేరు ప్రకటన | తెలంగాణ వార్తలు


Last Updated:

Kavitha: కొత్త పార్టీ పేరు అప్పుడే చెబుతామని కవిత తేదీని ప్రకటించారు. నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆమె వివరాలను వెల్లడించారు.

Kavitha: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయంలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీపై ప్రెస్ మీట్ పెట్టి కీలక అప్‌డేట్ ప్రకటించారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ కీలక ప్రకటన చేస్తున్నానని ఆమె చెప్పారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నామని కవిత అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్‌ నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు.

ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ సైతం ఉంటుందని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామంలో అద్వయ కన్వేషన్‌ హాల్‌లో ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆమె కోరారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అంతా తనతో కలిసి రావాలని కవిత విజ్ఞప్తి చేశారు. శ్రీ రాముడి దయతో అందరినీ కలుపుకొని వెళతామని ఆమె హామీ ఇచ్చారు. నేను నిజామాబాద్ కోడలిని తెలంగాణ బిడ్డను అని చెప్పారు. అంతకు ముందు ఖిల్లా రామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణలో ప్రజల కోసం కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉంది: 

ప్రజల కోసం కొత్త పార్టీ రావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందని కవిత చెప్పారు. కొత్త పార్టీ ఉండాలని బలంగా కోరుకుంటున్నామని అందుకే ఈ కొత్త పార్టీ పేదల కోసం పని చేసే పార్టీ అయి ఉండాలని కవిత అన్నారు. ఈ కొత్త పార్టీలో కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో పెద్ద పీట వేస్తామని కవిత తెలిపారు. బీఆర్‌ఎస్ క్యాడర్ మొత్తం మాతో ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీ అనేది లేదని.. తమ పార్టే మొదటి ప్రాంతీయ పార్టీ అని చెప్పుకొచ్చారు. మునీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఆవిర్భావసభలో పార్టీ అజెండా మొత్తం ఉంచుతామని ఆమె వెల్లడించారు. ఆరోజే పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు చెబుతామన్నారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించనుందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఆ పార్టీ పేరులోనూ, జెండాలోనూ తెలంగాణ సెంటిమెంట్, సంస్కృతి మూలాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed