Last Updated:
యశ్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ రోల్ ఎంత బోల్డ్ గా ఉండనుందో ఇప్పటికే వదిలిన ప్రమోషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ తాలూకు విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి.
‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత ‘రాకింగ్ స్టార్’ యశ్ (Rocking Star Yash) నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic). మలయాళ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ లాంటి వైవిధ్యమైన దర్శకురాలు ఒక కమర్షియల్ మాస్ హీరోతో సినిమా చేస్తుండటం, అందులోనూ యశ్ డిఫరెంట్ అండర్ వరల్డ్ డాన్ లుక్ లో కనిపించనుండటం ఈ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది.
‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారాగణం నటిస్తుండటం విశేషం.
రీసెంట్ గా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ‘తబాహి’ (Tabahi) అనే వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ లో కియారా అద్వానీ మునుపెన్నడూ లేనంత రొమాంటిక్, బోల్డ్ లుక్‌లో కనిపించి కుర్రకారుకు మతిపోగొడుతోంది. ఒకవైపు భయంకరమైన యాక్షన్, హింసతో పాటు ఈ చిత్రంలో రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందని ఈ పాటతో క్లారిటీ వచ్చేసింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
‘తబాహి’ సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కోసం కియారా అద్వానీ తీసుకున్న పారితోషికంపై ఇండస్ట్రీలో సరికొత్త చర్చ మొదలైంది. పాన్ ఇండియా లెవెల్‌లో యశ్ కు ఉన్న క్రేజ్, అలాగే కియారా కు నార్త్ తో పాటు సౌత్ లో ఉన్న మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఆమె అడిగినంత చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం కియారా సుమారు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. దానితో పోలిస్తే ‘టాక్సిక్’ చిత్రానికి ఆమె రెమ్యునరేషన్ ఏకంగా డబుల్ కావడం గమనార్హం.
తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యత, అలాగే డిమాండ్ మేరకు గ్లామరస్‌గా నటించినందుకు గానూ ఈ స్థాయి రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న కియారా అద్వానీ, ఈ డీల్ తో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నయనతార, దీపికా పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి చేరిపోయిందనే చెప్పుకోవాలి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














