Last Updated:
కోల్ కతాలో KKR టాప్ ఆర్డర్ విఫలం, మొహిసిన్ ఖాన్ 5 వికెట్లు, రింకూ సింగ్ 83తో జట్టు 155, లక్నో ఛేజ్ ఆసక్తికరం
కోల్ కతా వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చెత్త బ్యాటింగ్ పెర్ఫామెన్స్ కనబర్చింది. మొహిసిన్ ఖాన్ బౌలింగ్ దెబ్బకు KKR బ్యాటర్లు విలవిలలాడిపోయారు. చివర్లో రింకూ సింగ్ 83 (7 ఫోర్లు, 5 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు. అజింక్య రహానే (10), టిమ్ సీఫర్ట్ (0), రఘువంశీ (9), రొవ్‌మెన్ పవెల్ (1).. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. కెమెరాన్ గ్రీన్ (34) పర్వాలేదనిపించాడు. రింకూ సింగ్ చెలరేగడంతో కేకేఆర్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ముఖ్యంగా మొహిసిన్ ఖాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లనంతా పెవీలియన్‌కు పంపాడు. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరగులు ఇచ్చి 5 కీలక వికెట్లను పడగొట్టాడు. జార్జ్ లిండే ఒక వికెట్ తీసుకున్నాడు. మరి ఈ లో స్కోర్‌ను లక్నో ఛేజింగ్ చేస్తుందా లేదా అని వేచిచూడాలి.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













