Konda Surekha: కొండా సురేఖ కుర్చికి ఎసరు పెట్టిన సుస్మిత కామెంట్స్‌.. మంత్రికి షోకాజ్ నోటీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews

Konda Susmitha Comments


Last Updated:

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుస్మిత వ్యవహారం కాఫీ కప్పులో తుఫానుగా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్‌కి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది అధిష్టానం.

Konda Susmitha Comments
Konda Susmitha Comments

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుస్మిత వ్యవహారం కాఫీ కప్పులో తుఫానుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు..? రెండోది మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి రాజకీయంగా ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే ఇప్పుడు పార్టీకి సంబంధం లేని మంత్రి కూతురు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేయడానికి కారణమైనట్లుగా స్పష్టమవుతోంది. అంతే కాదు రెండ్రోజుల క్రితం జరిగిన ఓ వేదికపై సీఎంతో పాటు ఆయన సోదరులపై చేసిన ఆరోపణలకు కొనసాగింపుగానే అనేక మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వూలో అదే వాయిస్‌ని మళ్లీ రైజ్ చేశారు. తాను కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదని.. కేవలం రేవంత్ రెడ్డిపైనే మాట్లాడానంటూ తన మాటల్ని సమర్ధించుకున్నారు సుస్మిత. అంతే కాదు కాంగ్రెస్‌ను టీడీపీ బ్యాచ్‌తో నింపేసి పచ్చ కాంగ్రెస్‌గా మార్చేస్తున్నారని.. తన తండ్రికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు తప్పారని కొండా సురేఖ కూతురు సుస్మిత తన ఆక్రోషానికి గల కారణాన్ని చెప్పారు. ఇంతే కాదు మరో రెండేళ్లలో రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుతో పాటు తాను పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed