KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్! | ACTPnews

KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్!



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 30 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి విక్రయించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, గతంలో 2010లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి అమ్మిన ఒక భూమిని.. రేవంత్ రెడ్డి గత నెలలో మళ్లీ వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ భూవిక్రయాల వ్యవహారంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *