Last Updated:
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన లెనిన్ మూవీ షెడ్యూల్ ప్రకారం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారట.
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘లెనిన్’ చిత్రం గురించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక ఊహాగానం తెగ హల్చల్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు జూలై మధ్య వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ వార్త అక్కినేని ఫ్యాన్స్‌ను కాస్త నిరాశకు గురిచేస్తున్నప్పటికీ, సినిమా క్వాలిటీ కోసమే హీరో అఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘లెనిన్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్, మేజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ఇటీవల ఎడిటింగ్ టేబుల్‌పై ఫైనల్ రష్ చూసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు, అవుట్‌పుట్ పట్ల కొంత సంతృప్తితో ఉన్నారట. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలవడం ఖాయమని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
అయితే, సినిమా ఎంత బాగా వచ్చినప్పటికీ, సాంకేతిక హంగులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని హీరో అఖిల్ గట్టిగా నిర్ణయించుకున్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ పనుల క్వాలిటీ విషయంలో అస్సలు రిస్క్ తీసుకోకూడదని ఆయన భావించారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని కూడా పూర్తిగా ఫైన్ ట్యూన్ చేసి, ప్రేక్షకులకు థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అఖిల్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
తొందరపడి క్వాలిటీ లేని ప్రొడక్ట్‌ను రిలీజ్ చేయడం కంటే, మరో రెండు మూడు వారాలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ పక్కా పర్‌ఫెక్షన్‌తోనే థియేటర్లలోకి వెళ్దామని అఖిల్ సూచించడంతో మేకర్స్ ఈ వాయిదా నిర్ణయానికి మొగ్గు చూపినట్లు ఇన్సైడ్ టాక్. ‘ఏజెంట్’ సినిమా ఫలితం తర్వాత అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ప్రతీ చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి జూలై మధ్యలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













