Last Updated:
Lenin Trailer Review: వైజాగ్‌లో అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ బ్లాస్ట్! ఊరమాస్ రగ్గడ్ లుక్, థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో బాక్సాఫీస్ వేటకు రెడీ అయిన అయ్యగారు.. ఆ పవర్‌ఫుల్ ట్రైలర్ రివ్యూ ఇక్కడ చూడండి..
Lenin Trailer Review: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్కీ అప్‌డేట్ రానే వచ్చింది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌ను వైజాగ్‌లోని శరత్ థియేటర్ వేదికగా అభిమానుల సమక్షంలో చిత్రబృందం ఎంతో ఘనంగా లాంచ్ చేసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. అఖిల్ ఈసారి బాక్సాఫీస్ వద్ద పక్కాగా గట్టి వేటనే ప్లాన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎమోషనల్ సినిమా ట్రైలర్ హైలైట్స్, సరికొత్త లుక్ ముచ్చట్లు ఇప్పుడు క్లియర్ గా చూద్దాం.
ఈ ట్రైలర్‌లో అఖిల్ లుక్ మునుపటి సినిమాల కంటే చాలా భిన్నంగా, ఊరమాస్ రేంజ్ లో ఉంది. రగ్గడ్ హెయిర్ స్టైల్, గడ్డంతో అఖిల్ చెప్పే డైలాగులు థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. ‘నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్ చెప్పే మాస్ డైలాగ్స్ ట్రైలర్ కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంటెన్స్ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ట్రైలర్ లో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్, కెమిస్ట్రీ ఎంతో అందంగా, హాయిగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఎట్టా ఎట్టా’ వీడియో సాంగ్ సూపర్ హిట్ అవ్వగా.. ట్రైలర్ లో కూడా వీరి జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ తో పాటు ఒక అందమైన రూరల్ లవ్ స్టోరీ కూడా సినిమాలో బలంగా ఉండబోతోందని తెలుస్తోంది.
సినిమాలోని యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయడంలో టెక్నికల్ టీమ్ వర్క్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషన్ థమన్ ఎస్ (Thaman S) సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. నటులు శివాజీ, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున ఈ సినిమా అవుట్‌పుట్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పక్కా క్వాలిటీతో సరికొత్త అఖిల్ ను ప్రెజెంట్ చేయడానికి కొంత సమయం తీసుకున్నామని, జూలై 10, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోందని మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ తో పెరిగిన అంచనాలు చూస్తుంటే అఖిల్ కు ఈ సినిమా పక్కా కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













