Last Updated:
చెన్నై సూపర్ కింగ్స్ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు సాధించింది. కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ (71)తో జట్టును ఆదుకున్నాడు. లక్నో బౌలర్ ఆకాష్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు లక్నో సూపర్ జైయంట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. కార్తిక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కార్తిక్ 42 బంతుల్లో 71 (6 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు బాదాడు. మిగతా ప్లేయర్లంతా పెద్దగా పరుగులు సాధించలేకపోవడంతో సీఎస్కే భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (13), ఉర్విత్ పటేల్ (6).. ఇలా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. డేవాల్డ్ బ్రేవిస్ 25 (2 సిక్సులు) కార్తిక్ కు సపోర్ట్ ఇచ్చి.. పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో వచ్చిన శుభమ్ దూబే 32* (3 ఫోర్లు, 2 సిక్సులు), ప్రశాంత వీర్ (13*) వేగంగా పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 187 చేరుకుంది. ఇక లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్ అహ్మద్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













