Malviya Nagar Fire: రెస్టారెంట్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌లో ఇద్దర్ని కాపాడిన సాహస బాలలు.. ఎలాగో తెలుసా..? | | ACTPnews

Malviya


Last Updated:

Delhi Malviya Nagar Fire Ground Report: ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో, చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రజలు కేకలు వేస్తూ అరుస్తుండగా, కొందరు పైకప్పు నుంచి కిందకు దూకుతున్నారు. ఇది చూసిన 9 ఏళ్ల చంద్, అతని స్నేహితుడు అమిత్ కుమార్ చాకచక్యంతో ఇద్దరి ప్రాణాలు కాపాడారు.

+

Malviya Nagar Fire

Malviya Nagar Fire: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు ఈ రోజు ఉదయం ఒక పెను విపత్తుగా మారింది. మాల్వీయా నగర్‌లోని ఒక రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. కొందరు ఊపిరాడక మరణించారు. మృతుల సంఖ్య ఇప్పుడు 21కి చేరింది. ఆ రెస్టారెంట్ సమీపంలోని ఒక పరుపుల దుకాణంలో పనిచేసే 9 ఏళ్ల బాలుడు తన సమయస్ఫూర్తితో ఇద్దరి ప్రాణాలను కాపాడాడు. లోకల్18కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పరుపుల దుకాణంలో పనిచేసే 9 ఏళ్ల చంద్ , అమిత్ కుమార్ ప్రజలను కాపాడటానికి తమ దుకాణంలోని పరుపులను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ఇద్దరు పిల్లలు మరో ఇద్దరి ప్రాణాలను కాపాడారు. అయితే మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే లోపల చిక్కుకున్న వాళ్లు రెస్టారెంట్ నుండి బయటకు రాలేకపోయారు. దీంతో కొందరిని కాపాడటం అత్యంత కష్టమైంది.

బాధితుల కేకలు, అరుపులు విని..

అయితే మాల్వియా నగర్ లో ఈ రోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదం అక్కడి జనాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెస్టారెంట్‌లో అంటుకున్న మంటల్లో చాలా మంది చిక్కుకుపోయారు. దీనిపై 9 ఏళ్ల చంద్ మాట్లాడుతూ తాను ఉదయం 8:30 నుండి 9:00 గంటల మధ్య మేల్కొని దుకాణం వైపు వెళ్తుండగా రెస్టారెంట్ మొత్తం మంటల్లో కాలిపోవడం చూశానని చెప్పాడు. ప్రజలు అరుస్తూ, కేకలు వేస్తున్నారు. కొందరు పైకప్పు నుండి దూకుతున్నారు. ఇది చూసిన 9 ఏళ్ల చంద్ అతని స్నేహితుడు అమిత్ కుమార్ వెంటనే వారి పరుపుల దుకాణానికి పరుగెత్తారు. వారు దుకాణం తెరిచి ఎవరైనా పైనుంచి దూకితే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వీలుగా పరుపులను ఒక్కొక్కటిగా పేర్చడం ప్రారంభించారు.

పరుపులు పేర్చి ప్రాణాలు కాపాడారు..

పరుపుల షాపు తాళాలు ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటానని, అందుకే దుకాణం యజమానికి చెప్పకుండానే దుకాణం తలుపు తెరిచానని 9 ఏళ్ల చంద్ లోకల్18కి వివరించాడు. పరుపుల దుకాణంలో పనిచేసే అతని స్నేహితుడు అమిత్ కుమార్ కూడా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉండటంతో మూడో, నాలుగో అంతస్తులు ఉన్న రెస్టారెంట్ సమీపంలోని రోడ్డుపై దుకాణంలోని పరుపులన్నింటినీ వారు కలిసి పేర్చారు. వారి ప్రాణాలను కాపాడటానికి, 9 ఏళ్ల చంద్ , అమిత్ కుమార్ ప్రాణాలకు తెగించి సమయస్పూర్తితో వ్యవహరించారు. ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారు. హోటల్‌ మంటల్లో చిక్కుకున్న వారిలో చాలామంది అప్పటికే దూకేయడంతో మిగిలిన వారిని కాపాడలేకపోయారు. కొందరు ఊపిరాడక చనిపోయారు.

గేటు లోపలి నుంచి తాళం వేసి ఉంది..

పరుపుల దుకాణంలో పనిచేసే అమిత్ కుమార్ ఆ పరుపుల దుకాణం రెస్టారెంట్‌కు సరిగ్గా పక్కనే ఉందని చెప్పాడు. అతను అదే దుకాణంలో పనిచేస్తాడు. అతని ఇల్లు రెస్టారెంట్ వెనుకే ఉంది. బుధవారం ఉదయం అమిత్ కుమార్ అతని ఫ్రెండ్ చంద్ రెస్టారెంట్‌కు నిప్పంటుకోవడాన్ని చూసినప్పుడు .. పరుపులను ఉపయోగించి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించారు. లోపల చిక్కుకున్న వారు రెస్టారెంట్ తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికి ఆ తలుపు లోపలి నుండి డిజిటల్‌గా లాక్ చేయబడి ఉండటంతో ఎవరూ బయటకు రాలేకపోయారని చాంద్ తెలిపాడు. బాధితులు థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ నుండి కూకడం మొదలుపెట్టారు. ఫలితంగా ఒక్కొక్కరుగా మరణించారు.

యజమాని ప్రశంసలు

పరుపుల దుకాణంలో పనిచేసే చంద్ , అమిత్ కుమార్‌లను దుకాణం యజమాని ప్రశంసించారు. అంతేకాకుండా అగ్నిమాపక శాఖ ,పోలీసులు కూడా ఆ ఇద్దరు పిల్లల సమయస్ఫూర్తిని అభినందించారు. ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో అగ్నిప్రమాదం జరిగిన రెస్టారెంట్‌కు సరిగ్గా పక్కనే ఈ పాత పరుపుల దుకాణం ఉంది. దుకాణంలో పనిచేసే అమిత్ కుమార్, తాను పరుపులు డెలివరీ చేయడానికి , బ్లింకిట్ ఆర్డర్‌లు ఇవ్వడానికి తరచుగా లోపలికి వెళ్లేవాడినని, రెస్టారెంట్‌లో అగ్నిమాపక పరికరాల వ్యవస్థ లేదని వివరించాడు. అతను పై అంతస్తులో ఒక జనరేటర్‌ను కూడా గమనించినట్లుగా తెలిపాడు. దానివల్లే మంటలు అంత తీవ్రంగా ఎగసిపడినట్లు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports