Manchu Manoj: మతి స్థిమితం లేని వ్యక్తితో హీరో మంచు మనోజ్.. అలా చేయడంతో నెటిజన్లు ఫిదా! వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Manchu Manoj: మంచు మనోజ్ నాదర్‌గుల్ మాతృదేవోభవ అనాథాశ్రమంలో స్వయంగా హెయిర్ కట్ చేసి సేవ చేశారు, ఐక్య ధైర్య సేన సమితి ద్వారా సేవా కార్యక్రమాలు ప్రకటించి రియల్ హీరోగా ప్రశంసలు అందుకున్నారు

News18
News18

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సినిమాలతో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌, తాజాగా తెలంగాణలోని నాదర్‌గుల్‌లో ఉన్న మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించి అక్కడి వారితో ఎంతో ఆత్మీయంగా గడిపారు. ముఖ్యంగా అక్కడి ఓ వ్యక్తికి స్వయంగా హెయిర్ కట్ చేయడంతో పాటు గడ్డం ట్రిమ్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా సినీ ప్రముఖులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త విషయం కాదు. కానీ, స్వయంగా చేతులతో సేవ చేయడం మాత్రం అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంలో మంచు మనోజ్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అనాథాశ్రమంలోని వ్యక్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అక్కడి వాతావరణంలో పూర్తిగా కలిసిపోయిన మనోజ్‌ ఎలాంటి స్టార్ హంగులు లేకుండా ఎంతో సింపుల్‌గా వ్యవహరించడం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో మనోజ్ ఎంతో వినయంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తికి కుర్చీ వేసి కూర్చోబెట్టి స్వయంగా హెయిర్ ట్రిమ్మర్‌తో జుట్టు కత్తిరించడం, గడ్డం సెట్ చేయడం చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో బయటకు రావడంతో అభిమానులు “రియల్ హీరో”, “గోల్డెన్ హార్ట్ మనోజ్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు కేవలం ఫోటోలకే పరిమితమవుతారని, కానీ మనోజ్ మాత్రం నిజంగా సేవ చేస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.

ఇటీవలే మంచు మనోజ్ తన భార్య మౌనిక భూమాతో కలిసి “ఐక్య ధైర్య సేన సమితి” అనే సేవా సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, చిన్నారుల దత్తత, మహిళల సాధికారత వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలని వారు ప్రకటించారు. ఐదుగురు చిన్నారుల విద్య బాధ్యతను తీసుకుంటామని వెల్లడించారు.

సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించామని మనోజ్ ఇప్పటికే పలుమార్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నానని, జీవితంలో నిజమైన సంతోషం ఇతరులకు సహాయం చేయడంలోనే ఉందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి గుర్తుకొస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా తన సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్న మంచు మనోజ్‌, మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. స్టార్ హీరోగా కాకుండా సాధారణ మనిషిలా ముందుకు వచ్చి సేవ చేయడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *