Last Updated:
రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో SRH ఎదుట 229 భారీ టార్గెట్ సెట్ చేసింది.
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం 36 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇందులో 5 ఫోర్లు, 12 భారీ సిక్సులు కొట్టాడు. వైభవ్‌కు తోడుగా ధ్రువ్ జురెల్ 51 (8 ఫోర్లు, 1 సిక్స్).. చివర్లో డొనొవాన్ ఫిరేరా 35 (3 ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో SRH ఎదుట 229 భారీ టార్గెట్ సెట్ చేసింది. ఐతే, రాజస్థాన్ బ్యాటర్లు ఆడుతున్న తీరు చూసి 20 ఓవర్లలో ఈజీగా 250 చేస్తారని భావించారు. కానీ వరుసగా వికెట్లు పడటంతో స్పీడ్ కు బ్రేక్ పడింది. చివర్లో హెట్మేయర్ (11), రియాన్ పరాగ్ (7) పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో ఈషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టగా, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, హుసేన్ చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













