Metro Stations: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరే శుభవార్త.. 10 స్టేషన్ల భారీ మార్పులు! | | ACTPnews

Hyderabad Metro, Metro Stations, Hyderabad news, metro news, metro train, మెట్రో ట్రైన్, మెట్రో, హైదరాబాద్ మెట్రో, మెట్రో స్టేషన్


Hyderabad Metro, Metro Stations, Hyderabad news, metro news, metro train, మెట్రో ట్రైన్, మెట్రో, హైదరాబాద్ మెట్రో, మెట్రో స్టేషన్

హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రయాణం అంటేనే ఒకవైపు ఎంతో సౌకర్యం, ఇంకోవైపు పీక్ అవర్స్‌లో ఊపిరాడని తీవ్ర రద్దీ గుర్తుకువస్తాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో స్టేషన్లలో ఉండే జన సందోహం, దొరకని పార్కింగ్ కష్టాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ దైనందిన సమస్యలకు శాశ్వత చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) నడుం బిగించింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా, పార్కింగ్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేలా నగరంలోని పది ప్రధాన స్టేషన్లను ఆధునీకరించేందుకు అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఆధునిక మార్పులతో నగరవాసుల మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports