Last Updated:
PM Modi Reels: నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకోవడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తులు. ఆయన తన మైనస్‌లను బాగా గమనించుకుంటారు. వాటిని ప్లస్‌గా మార్చడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తారు. గతంలో ఇలాగే చేసి, సక్సెస్ సాధించారు. ఇప్పుడు జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు ఆయన.. సోషల్ మీడియాపై తన అస్త్రాలను వదులుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. యువతను, ముఖ్యంగా ‘జెన్ జీ’ (Gen Z) తరాన్ని ఆకర్షించేందుకు ఆయన సరికొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) ద్వారా ఆయన సాధిస్తున్న ఫాలోయింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు, ఆయన చేసిన కొన్ని రీల్స్ వ్యూహాత్మకంగా భారీ విజయాన్ని సాధించాయి.
సోషల్ మీడియాలో రికార్డు స్థాయి ఫాలోవర్లు:
తాజా గణాంకాల ప్రకారం, ఎక్స్ (X – గతంలో ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీకి 107 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 105 మిలియన్లకు చేరుకుంది. ఇదివరకు ఇన్‌స్టాలో ఫాలోవర్లు తక్కువ గానే ఉండేవారు. కానీ.. మోదీ ఇప్పుడు ఫొటోలతోపాటూ.. డైరక్టుగా రీల్స్ చేస్తుండటంతో.. ఒక్కసారిగా ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లుగా ఆయన షార్ట్ వీడియోల (Short Videos)పై దృష్టి సారించారు. వారంలోనే 3 వీడియో క్లిప్స్ పోస్ట్ చేశారు. వాటికి 48 లక్షల దాకా లైక్స్ వచ్చాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్షల పేపర్ లీక్ వివాదం, సీజేపీ (CJP) విద్యార్థి నాయకుల ఉద్యమం వల్ల.. ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి నేరుగా సెల్ఫీ వీడియోలు, రీల్స్ చేశారు. ఈ 3 రీల్స్‌కు ట్రెడిషనల్ మీడియా కూడా భారీ స్థాయిలో కవరేజ్ ఇవ్వడంతో అవి సోషల్ మీడియా అంతటా విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అర్థరాత్రి పోస్ట్ చేసిన తొలి రీల్ ద్వారా.. ఒక్క రాత్రిలోనే మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు ఒక మిలియన్ (పది లక్షల) మంది కొత్త ఫాలోవర్లు వచ్చి చేరారని బిజినెస్ టుడే, ది హిందూ రిపోర్ట్ చేశాయి. ఈ తాజా రీల్స్ ఆయన ప్రజాదరణను ఒక్కసారిగా పెంచేశాయి.
మంత్రులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు:
కేవలం తనకే కాకుండా, తన మంత్రివర్గ సహచరులకు కూడా మోదీ కీలక సూచనలు చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలనీ, ప్రభుత్వ పథకాలనూ, విధానాలనూ యువతకు చేరువ చేసేందుకు వీలుగా విధిగా రీల్స్ రూపొందించాలని ఆదేశించారు. సుదీర్ఘమైన ప్రసంగాల కంటే, కేవలం 15 నుంచి 60 సెకన్ల నిడివి ఉండే షార్ట్ వీడియోల ద్వారానే నేటి యువతకు సులభంగా కనెక్ట్ కావచ్చని ఆయన మంత్రులకు స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఇప్పటినుంచే పటిష్టమైన వ్యూహాన్ని రచిస్తున్నారు. ముఖ్యంగా ఏ ‘జెన్ జీ’ (Gen Z) యువత అయితే కొన్ని సామాజిక, రాజకీయ అంశాల ద్వారా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండి, ఆయన్ని వ్యతిరేకిస్తున్నారో.. అదే యువత అభిమానాన్ని పొందేందుకు మోదీ గట్టిగా ట్రై చేస్తున్నారు. యూత్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ అపూర్వ స్పందన, కొత్త ఫాలోవర్ల రాక రాజకీయంగా ఆయనకు మేలే చేసేలా కనిపిస్తోంది.
మీడియా వక్రీకరణలకు చెక్ – డైరెక్ట్ కనెక్షన్:
మోదీ అనుసరిస్తున్న ఈ సరికొత్త రీల్స్ వ్యూహం వల్ల మరో అతిపెద్ద ప్రయోజనం ఉంది. సాధారణంగా రాజకీయ నాయకుల వ్యాఖ్యలను కొన్నిసార్లు ట్రెడిషనల్ మీడియా తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వక్రీకరించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ఎక్స్ (X) ద్వారా నేరుగా ఫాలోవర్లతో మోదీ మాట్లాడినప్పుడు, మధ్యలో ఏ మీడియా సంస్థ కూడా.. ఆయన మాటలను తప్పుగా అన్వయించే అవకాశం ఉండదు. ఫాలోవర్లు ఆయన అసలు ఉద్దేశాన్నీ, భావాలను డైరెక్టుగా వీడియోల ద్వారా తెలుసుకుంటారు. తన సందేశం ఏమిటో, తాను ఏం చెప్పాలనుకుంటున్నారో నేరుగా ప్రజలకు చేరేలా ఈ విధానం ఒక ‘బ్రిడ్జి’ లాగా పనిచేస్తోంది. ఈ విధంగా ఏ వక్రీకరణలకూ తావులేకుండా, జెన్-జీ యూత్‌తో తన లింకును మోదీ బలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 28, 2026 12:02 PM IST














