Last Updated:
35 ఏళ్లుగా కొనసాగుతున్న ఖనిజ పన్నుల వివాదానికి ఇప్పుడు కీలక మలుపు వచ్చింది. ఆగస్టు 12, 2026న లోక్‌సభ, ఆగస్టు 13న రాజ్యసభ ఆమోదించిన MMDR Amendment Billతో రాష్ట్రాలు విధించే అదనపు పన్నులు, సెస్‌లు, లెవీలపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
India Mineral Tax Reform 2026: భారత్‌లో ఖనిజ భద్రత ఇక కేవలం గనుల రంగానికి సంబంధించిన అంశం కాదు. మౌలిక వసతులు, ఉక్కు, రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన ఖనిజాల సరఫరా దేశ ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉంది. దేశీయంగా కీలక ఖనిజాల ఉత్పత్తి బలహీనంగా ఉంటే దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖనిజాలపై పన్నుల విధానాన్ని స్పష్టీకరించే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది.














