Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews

Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు!



ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports