చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంత్రి నారా లోకేష్‌పై నిప్పులు చెరిగారు. తమ కుటుంబంపై లోకేష్ చేసిన కబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “మేము ఎక్కడ కబ్జాలు చేశామో లోకేష్ ఆధారాలతో నిరూపించాలి” అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో విషం బాటిల్ పట్టుకుని, గెలిపించకపోతే చనిపోతానని ప్రజలను వంచించి మీ ఎమ్మెల్యే గెలిచారని ఎద్దేవా చేశారు. నేడు ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో చేస్తున్న భూకబ్జాలను తాము ఆధారాలతో సహా బయటపెడతామని, దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదైతే.. ఎన్ని ఆశలు చూపినా వైఎస్ఆర్ కుటుంబాన్ని వదలని నిజాయితీ తమ నాన్నగారిదని మోహిత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు.
Source link
Mohith Reddy Challenges Lokesh | లోకేష్‌కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ సవాల్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










