Last Updated:
షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఆలోచన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సీనియర్ హీరో మురళి మోహన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత మరియు నూతన పరిచయం సీనియర్ నటుడు సుధాకర్ గారి అబ్బాయి బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్, తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పద్మశ్రీ మురళి మోహన్ చేతుల మీదుగా ఈ పోస్టర్ వదలడం విశేషం.
ఈ పోస్టర్ రిలీజ్ అనంతరం మురళి మోహన్ మాట్లాడుతూ .. అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో ఆలోచన మూవీ చేశారని, మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని ప్రశంసించారు. మంచి కథాబలం ఉన్న “ఆలోచన” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకున్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆలోచన” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













