Nagabandham Review: నాగబంధం మూవీ రివ్యూ.. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? సినిమా ఎలా ఉందంటే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేడు (జూలై 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘నాగబంధం’. “ది సీక్రెట్ ట్రెజర్” అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.

News18
News18

ఈ మధ్యకాలంలో డివోషనల్ థ్రిల్లర్, సోషియో ఫాంటసీ, అడ్వెంచరస్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భారీ ఆదరణ లభిస్తోంది. కార్తికేయ 2, విరూపాక్ష, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజయాల స్ఫూర్తితో అదే కోవలో భారీ అంచనాలతో నేడు (జూలై 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘నాగబంధం’. “ది సీక్రెట్ ట్రెజర్” అనేది ట్యాగ్ లైన్. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. యువ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, బాలీవుడ్ నటుడు రిషభ్ సావ్నీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ ప్రమోషన్స్ నడుమ నిన్న రాత్రి (జులై 2) ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఈ సినిమా ప్రధానంగా 1756, 1962.. రెండు భిన్నమైన కాలఖండాల్లో సాగుతుంది. హిమాలయాల్లోని ఓ రహస్య భైరాగి, రంగనాథస్వామి నాభిలోని బ్రహ్మకమలం, నాగబంధం అనే పురాతన పుస్తకం చుట్టూ ఈ కథను అల్లారు. ఆర్కియాలజీ స్పెషలిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు), విలన్ అలీ (రిషభ్ సావ్నీ) ఆ అరుదైన పుస్తకం, బ్రహ్మకమలం కోసం ముమ్మరంగా వెతుకుతుంటారు. శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఉండే ఆ బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకునే క్రమంలో హీరో రుద్ర (విరాట్ కర్ణ) ఎలా ఎంటర్ అయ్యాడు? ఓ అనాథ అయిన రుద్ర, తన పెంపుడు చెల్లి మానస (సోనియా సింగ్) పెళ్లి ఖర్చుల కోసం డబ్బు ఆశతో ఈ మిస్టరీలోకి అడుగుపెడతాడు. అసలు ఆ బ్రహ్మకమలంతో వాళ్లకు ఉన్న పనేంటి? ఆలయ అర్చకురాలి శిష్యురాలిగా ఉన్న పార్వతి (నభా నటేష్) నేపథ్యం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమా ప్రారంభం నుంచే అనంత పద్మనాభ స్వామి ఆలయంను తలపించే నేపథ్యం, భారీ సెట్స్, విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌లో వచ్చే 1756 నాటి ఎపిసోడ్స్, క్లైమాక్స్ యాక్షన్, డివోషనల్ ఎలివేషన్స్ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తాయి. ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి గ్రాఫిక్స్, శివుడిని రూపొందించడం మరో ఆకర్షణ. బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే ట్విస్టులు సెకండాఫ్‌ను నిలబెట్టాయి.

అయితే, ఫస్టాఫ్ లో అనవసరమైన అనసూయ ఫ్యామిలీ ట్రాక్స్, సీరియస్ కథ మధ్యలో వచ్చే రొమాంటిక్ సాంగ్స్ కాస్త బోర్ ఫీలింగ్ తెప్పించాయి. సనాతన ధర్మం గురించి కేవలం డైలాగ్స్ ద్వారా చెప్పడం కాకుండా, కథలో అంతర్లీనంగా ఎమోషన్‌తో ముడిపెట్టి చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. చిరంజీవి ‘అంజి’ సినిమా ఛాయలు అక్కడక్కడా కనిపిస్తాయి. సినిమా అంతా నాగబంధం సీక్రెట్ చుట్టూ తిప్పి, అసలు ఆ ట్రెజర్ ఏంటో చెప్పకుండా పార్ట్-2కి లీడ్ ఇవ్వడం ప్రేక్షకులను కాస్త నిరాశపరుస్తుంది. ఎడిటింగ్ పరంగా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే ఇంకా బాగుండేది.

నటీనటుల పనితీరు:

రుద్ర, నాగసాధువు అనే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో విరాట్ కర్ణ తన నటనతో, కష్టంతో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ నటుడు రిషభ్ సావ్నీ నెగిటివ్ రోల్‌లో, ముస్లిం రాజుగా అదరగొట్టాడు. ఈ చిత్రంతో అతనికి టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. డ్యూయల్ రోల్‌లో నభా నటేష్ సాంప్రదాయంగా కనిపిస్తూనే గ్లామర్ ఒలకబోసింది. యూట్యూబ్ స్టార్ సోనియా సింగ్‌కు మంచి చెల్లి పాత్ర దక్కింది. అనసూయ, అంకిత్ కొయ్య, మురళీ శర్మ, ఐశ్వర్య మీనన్ తమ పరిధి మేర నటించి మెప్పించారు.

ట్రెజర్ హంట్, సనాతన ధర్మం అనే పాయింట్లను బేస్ చేసుకుని భారీ నిర్మాణ విలువలతో తీసిన ఈ సినిమా విజువల్ ట్రీట్ అనే చెప్పుకోవాలి. ఎమోషనల్ కనెక్ట్, స్క్రీన్‌ప్లేలో మరింత వేగం ఉండి ఉంటే భారీ బ్లాక్ బస్టర్ పక్క అని చెప్పేవాళ్ళం. ఫస్టాఫ్ ల్యాగ్ ను భరిస్తే, సెకండ్ హాఫ్ ట్విస్టులు, క్లైమాక్స్ కోసం థియేటర్లలో చూడదగ్గ చిత్రమిది.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *