Nana Patekar: ‘ఆయన నటనలో నిజాయితీ కనిపించేది’.. నానా పటేకర్ మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నానా పటేకర్ మృతి పట్ల ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. నానా పటేకర్‌ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్‌ తెలిపాడు.

News18
News18

నానా పటేకర్ మృతి పట్ల ఎన్టీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఆయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. నానా పటేకర్‌ మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్‌ తెలిపాడు. “భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటుల్లో ఒకరైన నానా పటేకర్‌ సర్‌ మరణం ఎంతో బాధ కలిగించింది. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ ఒక ప్రత్యేకమైన నిజాయితీ కనిపించేది” అని ఆయన పేర్కొన్నారు.

ఆయన తెరపై కనిపించినప్పుడు నటిస్తున్నట్లు ఎప్పుడూ అనిపించేది కాదని, నిజ జీవితమే ప్రేక్షకుల కళ్లముందు ఆవిష్కృతమవుతున్న అనుభూతి కలిగేదని అన్నాడు. ఒక పాత్రను కేవలం నటించడం కాకుండా, దానికి ప్రాణం పోసే అరుదైన కళాకారుడిగా నానా పటేకర్‌ నిలిచారని కొనియాడారు.

నానా పటేకర్‌ వంటి గొప్ప కళాకారుడి సేవలను భారతీయ సినిమా తరతరాల పాటు గుర్తుంచుకుంటుందని జూనియర్ ఎన్టీఆర్‌ అన్నారు. భారతీయ సినీ రంగంపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోదని పేర్కొన్నాడు. నానా పటేకర్‌ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నాడు.

“ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు నా హృదయపూర్వక సానుభూతి. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, అందించిన గొప్ప కళాత్మక సహకారం తరతరాల పాటు గుర్తుండిపోతుంది. ఓం శాంతి” అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ తన నివాళిని ముగించారు.

దశాబ్దాల పాటు భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన నానా పటేకర్‌ నటనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో వాటిని పండించిన ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. సహజమైన నటన, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ, పాత్రలోకి పూర్తిగా ఒదిగిపోయే విధానం నానా పటేకర్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

నానా పాటేకర్ కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. గోవాలోని తన ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను తన ఫ్యామిలీ.. వెంటనే దోనా పౌలా ఏరియాలోని ఓ ప్రైవేల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే ఆయన చనిపోయారు. నానా పటేకర్ ఈ రోజు తెల్లవారుజామున 5:20 నిమిషాలకు చనిపోయినట్లు తెలుస్తుంది. ఆయన మరణ వార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports