Trump: 8 ప్రపంచ యుద్ధాలు ఆపేశా.. నాకంటే మెునగాడు లేడు.. నోబెల్ శాంతి బహుమతి నాకే ఇవ్వండి.. | | ACTPnews

Donald Trump Nobel Peace Prize


Last Updated:

నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మరోసారి చర్చలోకి వచ్చింది. తాను ఏకంగా ఎనిమిది యుద్ధాలకు పరిష్కారం చూపించానని, ఇంతకుముందు ఏ అధ్యక్షుడు చేయని పనులను తాను చేశానని ట్రంప్ చెబుతున్నారు. నోబెల్ శాంతి బహుమతిపై ఆయనకు ఇంత ఆసక్తి ఎందుకు? గతంలో ఎన్నిసార్లు తన అభ్యర్థిత్వాన్ని ప్రస్తావించారు? అక్టోబర్ 9న నోబెల్ కమిటీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Donald Trump Nobel Peace Prize
Donald Trump Nobel Peace Prize

నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాదనను బలంగా వినిపించారు. తాను ఏకంగా ఎనిమిది యుద్ధాలకు పరిష్కారం చూపించానని, గతంలో ఏ అధ్యక్షుడు చేయని పనులను తాను చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. మరో అంతర్జాతీయ వివాదానికి కూడా త్వరలో పరిష్కారం లభించొచ్చని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు దక్కుతుందా? అన్న చర్చ మరోసారి మొదలైంది.

జోంగ్ ఉన్‌తో సమావేశం అనంతరం ఇద్దరు నార్వే రాజకీయ నాయకులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించినట్లు ప్రకటించారు. 2019లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే కూడా తనను నామినేట్ చేశారని ట్రంప్ చెప్పారు. అయితే అబే దీనిని బహిరంగంగా ధృవీకరించలేదు.

2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ తనకు ఈ గౌరవం దక్కాలని బలంగా వాదించారు. 2009లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన పరిస్థితిని పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు.

రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత మరింత జోరు

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత నోబెల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వైట్‌హౌస్‌లో భేటీ సందర్భంగా తనకు నోబెల్ ఎప్పటికీ ఇవ్వకపోవచ్చని, కానీ తాను దానికి అర్హుడినని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్–పాకిస్థాన్, ఇజ్రాయెల్–ఇరాన్, కంబోడియా–థాయ్‌లాండ్, సెర్బియా–కొసోవో, రువాండా–డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్–ఇథియోపియా, అర్మేనియా–అజర్‌బైజాన్ మధ్య వివాదాల్లో అమెరికా పాత్రను ట్రంప్ తన నోబెల్ వాదనకు ఆధారంగా ప్రస్తావిస్తున్నారు. 2025 జూన్‌లో తనకు ఇప్పటికే ఒకటి కాదు, పలుమార్లు నోబెల్ శాంతి బహుమతి దక్కాల్సిందని కూడా అన్నారు.

మద్దతుగా మిత్రులు, నేతలు

ట్రంప్ నోబెల్ అభ్యర్థిత్వాన్ని ఆయన ఒక్కరే ప్రచారం చేయడం లేదు. మిత్రపక్ష నేతలు, విదేశీ నాయకులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. 2026 జనవరిలో రిపబ్లికన్ ప్రతినిధి క్లాడియా టెన్నీ మూడోసారి ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. అబ్రహామ్ ఒప్పందాలతో పాటు పలు అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలను ఆమె ప్రస్తావించారు.

ప్రతి ఏడాది నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తుంది. 2026 నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. 2025లో ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆ పురస్కారం వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కింది. ఈ ఏడాది కూడా ట్రంప్ పేరు నామినేషన్లలో ఉండొచ్చన్న ప్రచారం నేపథ్యంలో.. చివరకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports