తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్‌కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ కుమార్తెలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, అలాగే బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఘాట్‌ను సందర్శించి తమ పితృదేవుడికి ఘన నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ అమరుడేనని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
Source link
Nandamuri Family at NTR Ghat: ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి ఫ్యామిలీ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










