Last Updated:
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్ బీట్ వదిలారు.
నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. దీంతో ఇప్పుడు రాబోయే ఈ చిత్రంపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశారు.














