Nasir Best: ‘నేనే జీసస్‌.. నేనే ఒసామా బిన్ లాడెన్’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడి గురించి షాకింగ్ నిజాలు | | ACTPnews

నసీర్ బెస్ట్


Last Updated:

వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని నసీర్ బెస్ట్‌గా పోలీసులు గుర్తించారు. బెస్ట్ గురించి పోలీసులు పాత వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. అవేంటో మీరూ తెలుసుకోండి

నసీర్ బెస్ట్
నసీర్ బెస్ట్

Nasir Best: అమెరికా దేశాధినేత అధికారిక నివాసమైన వైట్ హౌస్ వెలుపల మే 23, శనివారం రాత్రి జరిగిన సంచలన కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరిపి, భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మరణించిన సాయుధ దుండగుడిని నసీర్ బెస్ట్(21)గా అమెరికా నిఘా వర్గాలు అధికారికంగా గుర్తించాయి. దాడి జరిగిన సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలి ఓవల్ ఆఫీసులోనే ఉన్నప్పటికీ, ఆయన సురక్షితంగా ఉన్నారని భద్రతా సంస్థలు ప్రకటించాయి.

ఏం జరిగింది?

వాషింగ్టన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి వైట్ హౌస్ ప్రాంగణానికి సమీపంలోని 17వ స్ట్రీట్ నార్త్‌వెస్ట్ వద్ద నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించాడు. అక్కడ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్దకు రాగానే, బెస్ట్ అకస్మాత్తుగా తన వద్ద ఉన్న రివాల్వర్‌ను బయటకు తీసి అక్కడి అధికారులపైకి వరుసగా కాల్పులు జరిపాడు.

ప్రమాదాన్ని గుర్తించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ యూనిఫామ్డ్ డివిజన్ అధికారులు తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరిపారు. క్షణాల వ్యవధిలోనే బెస్ట్‌ను కాల్చిపడేశారు. బుల్లెట్ గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

30 రౌండ్ల కాల్పులు – పౌరుడికి గాయాలు

ఈ ఘర్షణలో ఇరువైపులా కలిపి దాదాపు 25 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల వల్ల అక్కడ నిలబడి ఉన్న ఒక సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి విచిత్ర నేపథ్యం

నసీర్ బెస్ట్ గురించి దర్యాప్తు చేయగా.. అతడు తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు, గతంలోనే భద్రతా సంస్థల రడార్‌లో ఉన్నట్లు తేలింది. 2025 జూన్‌లో వైట్ హౌస్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నందుకు, ‘తానే దేవుడిని’ అని అరిచినందుకు సీక్రెట్ సర్వీస్ అతడిని అరెస్ట్ చేసి మానసిక వైద్యశాలకు తరలించింది. ఆ తర్వాత జూలై 2025లో వైట్ హౌస్ లోపలికి నిషేధిత మార్గం ద్వారా చొరబడటానికి ప్రయత్నించగా మళ్లీ పట్టుబడ్డాడు.

గతంలో పోలీసులు అతడిని నిర్బంధించినప్పుడు.. కోర్టు రికార్డుల ప్రకారం, “తానే ఆధునిక యుగపు జీసస్ క్రైస్ట్‌నని, అందుకే తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు” బెస్ట్ పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. అలాగే సోషల్ మీడియాలో తనే నిజమైన ‘ఒసామా బిన్ లాడెన్’ అని కూడా పోస్టులు పెట్టాడు.

బెస్ట్ ప్రవర్తన దృష్ట్యా, వైట్ హౌస్ ప్రాంగణ దరిదాపుల్లోకి రాకూడదంటూ గతంలోనే కోర్టు ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. అయితే, మే 23న అతడు ఆ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఆయుధంతో వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports