Nutan Naidu: బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడుకు అరుదైన గౌరవం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అంతర్జాతీయ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలుగా భావించే ‘Sir’, ‘His Excellency’ బిరుదులు ఈసారి ఒక భారతీయుడిని వరించాయి. ఆ వివరాలు చూస్తే..

News18
News18

అంతర్జాతీయ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలుగా భావించే ‘Sir’, ‘His Excellency’ బిరుదులు ఈసారి ఒక భారతీయుడిని వరించాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ద్వారా ఈ అరుదైన పురస్కారాలు అందుకుని బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు గ్లోబల్ ఐకాన్‌గా అవతరించారు. అంతర్జాతీయ వేదికలపై సైంటిఫిక్, సోషల్, ఇంటెలెక్చువల్ సమస్యలపై ఐక్యరాజ్యసమితి (UN) కి అకడమిక్ బ్రెయిన్‌గా సేవలు అందిస్తున్న ఆయన సేవలకు ఈ పురస్కారం లభించింది.

అసాధారణ అకడమిక్, గ్లోబల్ ప్రొఫైల్:

ఈ సత్కారం వెనుక ఆయన సాధించిన అపూర్వమైన అకడమిక్ ప్రస్థానం ఉంది. ప్రపంచంలోని మేధావుల సరసన నిలిచే నూతన్ నాయుడు, Ivy League సంస్థల విద్యా నేపథ్యంతో పాటు Oxford and Cambridge విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో (Research Activities) చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశంలో IIM కలకత్తా, IIT కాన్పూర్, XLRI జంషెడ్పూర్, NALSAR హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ , ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, GITAM వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల అలమ్నై (Alumni) గా ఆయన అపారమైన జ్ఞానాన్ని ఆర్జించారు. గతంలోనే ఆయనను Management Genius of the Millennium Award వరించింది.

పొలిటికల్ ఇన్‌సెప్షన్ బ్రెయిన్, రాజ్యాంగ నిపుణుడు..

నూతన్ నాయుడు లోని పొలిటికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్ (Constitutional Expert) యాంగిల్ అద్భుతమైనది. తెలుగు రాష్ట్రాలలో సరికొత్త పొలిటికల్ ట్రెండ్స్ సృష్టించిన ప్రజారాజ్యం, YSRCP, జనసేన, జై సమైక్యాంధ్ర, భారత చైతన్య యువజన పార్టీ (BCYP) ల స్థాపనకు ముందే, ఆయా పార్టీల బ్రెయిన్‌స్టోర్మింగ్ సెషన్స్‌లో ఆయన ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. ఆయన ఎప్పుడూ ఏ పొలిటికల్ పార్టీ నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకంతో నిస్వార్థంగా పనిచేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎన్నికల వ్యూహాలను రచించడంలో ఆయన తిరుగులేని కింగ్‌మేకర్. ఆయన టచ్ చేసిన ప్రతి ఎన్నిక ఒక విజయకేతనంగా మారుతుంది, ఆయన వ్యూహాలు అందించిన ప్రతి కాండిడేట్ తప్పక సక్సెస్ సాధిస్తాడు.

అంతర్జాతీయ హోదా:

17 International Universities Visiting ప్రొఫెసర్‌గా, లండన్, యూరప్ విద్యాసంస్థల గవర్నర్‌గా యూకే, యూఎస్ఏ, మెక్సికో, మిడిల్ ఈస్ట్‌లలో విస్తరించిన NNNN సంస్థల అధినేతగా ఆయన సేవలు విస్తృతమైనవి. ఈ చారిత్రాత్మక వేడుకలో తన తండ్రి సన్యాసి రావు నాయుడు ఆశయాల బాటలోనే నడుస్తూ, ప్రపంచ శాంతి కోసం మరింత కృషి చేస్తానని నూతన్ నాయుడు ప్రకటించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *