Last Updated:
ఈ మధ్యకాలంలో డిఫరెంట్ టైప్ ఓటీటీ థ్రిల్లర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అదే బాటలో వెళ్ళడానికి రెడీ అయింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్.
ఈ మధ్యకాలంలో డిఫరెంట్ టైప్ ఓటీటీ థ్రిల్లర్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అదే బాటలో వెళ్ళడానికి రెడీ అయింది ఎం4ఎం మూవీ. దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి జో శర్మ హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్‌ను సాధించింది. భారత్‌తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా అభివర్ణించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఇప్పుడు “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జూన్ 19 నుంచి లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, జియోటీవీ, టాటా ప్లే బింజ్ తదితర ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది.
మోహన్ వడ్లపట్ల రూపొందించిన ఈ చిత్రం సస్పెన్స్, మిస్టరీ, డ్రామా, వినోదాన్ని సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపొందిన ఈ చిత్రం, తెలివైన థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది.
కథ:
హైదరాబాద్ నగరాన్ని ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ గజగజలాడిస్తుంటాడు. ఈ హంతకుడు తను చేసే ప్రతి హత్యను ప్రసిద్ధ చిత్రలేఖనాల (Paintings) రూపంలో అలంకరించడం ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన, భయంకరమైన అంశం. ఈ వరుస హత్యల నేపథ్యంలో ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య) ఒకవైపు, మరోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) తమ సొంత దర్యాప్తును ప్రారంభిస్తారు. కిల్లర్ పోలీసులను తన వాయిస్ మెసేజ్‌లతో సవాల్ చేస్తుంటే, కృష్ణ, రాధ ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని (Motive) ఎలా కనుగొన్నారనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













