Pawan Kalyan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన అర్జున్ రెడ్డి నటుడు | తెలంగాణ వార్తలు | ACTPnews

ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రెస్‌మీట్.. ఏమన్నారంటే..!


Last Updated:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గ్రామసభ, పెసా చట్టాలపై ప్రశ్నలు

ఎక్స్ వేదికగా వేదికగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే రాహుల్ రామకృష్ణ.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌ను.. గ్రామసభల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాల్సిన ‘పెసా’ చట్టం గురించి ఆయన ప్రశ్నించారు.

గ్రామసభల అధికారాలు, స్థానిక స్వపరిపాలన చట్టాల అమలు తీరుపై పవన్ కల్యాణ్‌కు ఉన్న అవగాహనను ప్రస్తావిస్తూ రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు చేశారు. ఈ ప్రశ్నలు వేస్తూనే, తన ట్వీట్ల చివర్లో “జై తెలంగాణ” అని పేర్కొనడం మరిన్ని చర్చలకు దారితీసింది. రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి, జాతిరత్నాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా.. దేశద్రోహిని కాదు

ఈ ట్వీట్లపై పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి, జనసేన శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, నెగెటివ్ కామెంట్లు రావడంతో రాహుల్ రామకృష్ణ మరోసారి స్పందించారు. తాను పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్ అని, ఒక అభిమానిగా మాత్రమే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని క్లారిటీ ఇచ్చారు. “నేను మీ ఫ్యాన్‌గా అడుగుతున్నా… దేశ ద్రోహిని కాదు” అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను పాలన పరమైన చట్టాల గురించి ప్రశ్నించే హక్కు పౌరుడిగా తనకు ఉందని ఆయన సమర్థించుకున్నారు.

గతంలోనూ పలు వివాదాస్పద, సూటిగా ఉండే పోస్టులతో వార్తల్లో నిలిచిన రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు నేరుగా ఏపీ డిప్యూటీ సీఎంను చట్టాల అమలుపై ప్రశ్నించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *