Jr NTR: లిటిల్ ఫ్యాన్స్‌కు కుకీస్ పంపిన ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న అభిమానుల కోసం స్వయంగా కుకీలు తయారు చేసి పంపించడంతో ఆయన మంచి మనసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ మధుర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

News18
News18

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తన సింప్లిసిటీ, అభిమానులపై చూపే ప్రేమతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎన్టీఆర్ తాజాగా ఇద్దరు చిన్నారులకు ఇచ్చిన సర్‌ప్రైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఎన్టీఆర్ తొలిసారిగా బేకింగ్ చేస్తూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇది సాధారణ వీడియో కాదని, తన ఇద్దరు చిన్న అభిమానులను ఆశ్చర్యపరచడానికి ఆయన స్వయంగా కుకీలు తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తానే తయారు చేసిన ఆ కుకీలను చిన్నారులకు ప్రత్యేకంగా పంపించి వారి ఆనందానికి కారణమయ్యారు.

ఈ విషయాన్ని చిన్నారుల తండ్రి సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

“సాధారణంగా చేసిన ఒక కామెంట్ ఇంత అందమైన సర్‌ప్రైజ్‌గా మారుతుందని ఊహించలేదు. ఈ రోజు కుకీలు మా ఇంటికి చేరాయి. పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఆటోగ్రాఫ్‌తో నేను ఆనందంలో తేలిపోతున్నాను. అభిమానులు, ప్రేమ, దయ, మధుర జ్ఞాపకాలను కలిపే వంతెనలా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా మారిపోతుంది” అంటూ ఆయన భావోద్వేగంగా రాసుకొచ్చారు.

ఈ పోస్టుకు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. స్టార్ హీరో అయినప్పటికీ చిన్నారుల కోరికను గుర్తుంచుకుని స్వయంగా కుకీలు తయారు చేసి పంపించడం ఎన్టీఆర్ గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని అత్యంత పవర్‌ఫుల్, డార్క్ లుక్‌లో దర్శనమిచ్చారు. ‘లూగర్’ అనే క్రూరమైన హంతకుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. మాదక ద్రవ్యాలు, నేరాలు, రాజకీయ కల్లోలాల నేపథ్యంలో సాగే ఈ కథ 1967 కాలాన్ని ప్రతిబింబించనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports