Peddi OTT: రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ అఫీషియల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. థియేటర్స్ లో సత్తా చాటిన పెద్ది ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకొచ్చింది.

News18
News18

మెగా పవర్‌ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. వెండితెరపై తన అద్భుతమైన నటనతో, కళ్లు చెదిరే మాస్ అవతార్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని జాతీయ అవార్డు సాధించిన యువ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సినిమా, ఓటీటీ ప్రియులను అలరించేందుకు ముస్తాబైంది.

ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. జూలై 09 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే, అంటే దాదాపు 5 వారాల థియేట్రికల్ విండోను మాత్రమే పూర్తి చేసుకుని ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతుండటం అభిమానులకు పండుగ లాంటి వార్త. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ ప్రేక్షకుల సౌలభ్యం కోసం.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ కు దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా ఈ ఓటీటీ రిలీజ్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మించగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించాయి. గ్రామీణ నేపథ్యం, పక్కా మాస్ అంశాలతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని సరికొత్త మేకోవర్‌లో, అత్యంత రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి అభిమానులను మెప్పించారు. బుచ్చిబాబు సన వినూత్న టేకింగ్, సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే, చరణ్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొనగా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రికార్డు స్థాయి ధరకు ‘పెద్ది’ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు, అలాగే రామ్ చరణ్ మాస్ విశ్వరూపాన్ని కుటుంబ సమేతంగా ఇంట్లో మళ్లీ మళ్లీ చూడాలనుకునే సినీ అభిమానులకు జూలై 09 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports