దర్శకుడు బుచ్చిబాబు సన అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కోసం హైదరాబాద్‌లో 1980ల నాటి కోస్తా గ్రామాల సెట్లను అద్భుతంగా నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించగా, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్‌గా మెప్పించబోతున్నాడు.













