Peddi Ram Charan: అరెరే..! నోరు జారిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భోపాల్‌లో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

News18
News18

పాపం.. అసలే మన రామ్ చరణ్‌కు మతిమరుపు ఎక్కువ. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు ఒప్పుకున్నారు. పేర్లు గుర్తుపెట్టుకోవడంలో తాను చాలా వీక్ అని కూడా.. పలు ఈవెంట్స్‌లో చెప్పాడు. ఐతే, భోపాల్‌లో జరిగిన పెద్ది ప్రమోషన్స్ ఈవెంట్‌లో (Peddi Promotions Bhopal Event) కూడా చరణ్ నోరు జారాడు. తన స్పీచ్ అనంతరం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న చరణ్‌ను.. స్టేజిపై ఉన్న యాంకర్ ఆపి టీమిండియా స్టార్ ప్లేయర్లపై తన అభిప్రాయాన్ని అడిగారు. మొదట సచిన్ టెండుల్కర్ పేరు చెప్పగా.. తను ఒక లెజండ్ అని అన్నారు. ఇక ధోనిని కామ్ అండ్ కంపోజ్డ్ అని చరణ్ కొనియాడాడు. రోహిత్ శర్మ అందరివాడని.. విరాట్ కోహ్లీ ఒక ఫైర్ అని చెప్పాడు. చివర్లో జస్ప్రిత్ బుమ్రాపై తన అభిప్రాయాన్ని అడగగా.. బుమ్రాకు నేను పెద్ద ఫ్యాన్ అని.. అతను అద్భుతంగా ఫుట్‌బాల్ ఆడుతాడని చరణ్ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. ఫుట్ బాల్ బుమ్రా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడని పొగిడాడు.

ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ ఒక్క క్లిప్ తెగ వైరల్ అవుతోంది. అసలు జస్ప్రిత్ బుమ్రా టీమిండియా ఫాస్ట్ బౌలర్ కదా.. ఫుట్‌బాల్ ప్లేయర్ ఎప్పుడయ్యాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చరణ్‌ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశాయి. బుమ్రా టీమిండియా ప్లేయర్

పాపం.. చరణ్‌ అసలే స్టేజీ ఎక్కనప్పటి నుంచి హిందీ తడబడుతూ మాట్లాడుతున్నాడు. ముందే చెప్పాడు.. నాకు హిందీ అంత పర్ఫెక్ట్‌గా రాదని.. కాబట్టి కొంచం అజస్ట్ అవ్వాలని కోరాడు. కాస్త ఇబ్బంది పడ్డా.. బాగానే తన స్పీచ్‌ను ముగించేశాడు. బహుషా హిందీ అంతసేపు మాట్లాడి.. కాస్త కంగారులో ఉన్నట్టున్నాడు. అందుకే బుమ్రా పేరు చెప్పగానే మంచి ఫుట్ బాల్ ప్లేయర్ అని మర్చిపోయి చెప్పి ఉంటాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా రాజమౌళి, ఎన్టీఆర్ సైతం ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. రామ్ చరణ్ పేర్లు గుర్తుపెట్టుకోవడంలో చాలా వీక్ అని అన్నారు.

ఇక ఈవెంట్ విషయానికి వస్తే.. పెద్ది సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports