Peddi: పెద్ది మూవీకి బిగ్ షాక్..! ఆన్ లైన్‌లో సినిమా హై క్వాలిటీ HD ప్రింట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అలా విడుదలైందో లేదో.. ఇలా పెద్ది సినిమాకు బిగ్ షాక్ తగిలింది. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుండగా.. పైరసీ ప్రింట్ బయటకొచ్చింది.

News18
News18

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసాన్ని సృష్టిస్తోంది. వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ విజువల్ వండర్‌ను, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా సమర్పించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితుల నడుమ ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది.

పైరసీ భూతం పెద్ది సినిమాను కూడా పట్టేసింది. థియేటర్లలో విడుదలైన రెండో రోజే ఈ చిత్రం పలు పైరసీ సైట్లలో ప్రత్యక్షం అయింది. ఆన్‌లైన్‌లో హైక్వాలిటీ ప్రింట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇది చూసి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెద్ది పైరసీ లింకులను వెంటనే తొలగించి, ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్రబృందాన్ని, పోలీసులను కోరుతున్నారు.

ఈ సినిమాపై జనాల్లో పాజిటివ్ బజ్ అయితే ఉంది. రామ్ చరణ్ తన రెగ్యులర్ కమర్షియల్ ఇమేజ్‌కు భిన్నంగా, సరికొత్త మేకోవర్, అత్యంత భావోద్వేగభరితమైన పాత్రలో నటించిన తీరు అద్భుతంగా ఉందంటూ సినీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ పర్ఫార్మెన్స్‌కు జాతీయ అవార్డు రావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గ్లోబల్ వైడ్‌గా ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరిగాయి. కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే ఈ చిత్రం ఏకంగా రూ. 21.5 కోట్లకు పైగా వసూళ్లను సాధించి శుభారంభం పలికింది పెద్ది. ఆపై తొలి రోజే 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. సంగీత దిగ్గజం రెహ్మాన్ సంగీతం అందించారు. కాకపోతే ఇది వన్ మ్యాన్ షో అని రివ్యూ రావడం, క్రెడిట్ అంతా కూడా రామ్ చరణ్ కే దక్కడం చూసే ఉన్నాం. ఇంతలోనే మరో బాంబులా పైరసీ ప్రింట్ బయటకొచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed