#PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో కేవలం అద్దాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారని, కానీ భూములిచ్చిన రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం చేయలేదని పేర్ని నాని ఘాటుగా విమర్శించారు.
Source link
Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










