PM Modi: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో ప్రధాని నివాళులు.. కనీసం ఒక్క ఖాదీ వస్తువైనా కొనాలని పిలుపు! | | ACTPnews

గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ


Last Updated:

PM Modi: మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ
గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

దేశానికి బాపూజీ అందించిన సేవలను స్మరించుకున్న ప్రధాని, ప్రతి పౌరుడూ స్వదేశీ భావజాలాన్ని అలవర్చుకోవాలని, గాంధీ జయంతిని పురస్కరించుకుని కనీసం ఒక్క ఖాదీ వస్తువైనా కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక వీడియో సందేశాన్ని పంచుకున్న ప్రధాని మోదీ, దేశ నిర్మాణంలో మహాత్ముడి పాత్రను కొనియాడారు. స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి సారించాలని నొక్కిచెప్పారు. గాంధీజీ ఆశయాలకు గౌరవంగా ఖాదీతో తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాపూజీ శాశ్వత సందేశం మెరుగైన సమాజ నిర్మాణానికి, వికసిత్ భారత్ సాధనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.

రాజ్‌ఘాట్‌లో పుష్పాంజలి

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, గాంధీ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సర్వధర్మ ప్రార్థనా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన బోధనలను స్మరించుకున్నారు. స్వయం సమృద్ధి, స్వదేశీ వస్తువుల వాడకంపై బాపూజీ ఇచ్చిన ప్రాధాన్యతను తన వీడియోలో గుర్తుచేసిన మోదీ, నిత్య జీవితంలో స్వదేశీని ఒక భాగంగా చేసుకోవాలని ప్రజలను కోరారు.

విజయ్‌ఘాట్‌లో లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి

అనంతరం ప్రధాని మోదీ విజయ్‌ఘాట్‌ను సందర్శించి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా ఆయన స్మారకం వద్ద నివాళులర్పించారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన శాస్త్రి, “జై జవాన్, జై కిసాన్” నినాదంతో యావత్ భారతావనిని ఉత్తేజపరిచారు.

ప్రతి సంవత్సరం అక్టోబరు 2న దేశవ్యాప్తంగా గాంధీ జయంతిని, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన గాంధీజీ అహింస, స్వయం సమృద్ధి, స్వదేశీ సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేశారు. బ్రిటిష్ వస్తువులపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఆయన ఖాదీ ఉద్యమాన్ని నడిపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports