Poonam Kaur: ఇంకెంత మంది జీవితాలు నాశనం కావాలి.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ సారి నేరుగా పూనమ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

News18
News18

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సాధారణంగా గురూజీ (త్రివిక్రమ్) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిసారీ సోషల్ మీడియాలో పరోక్షంగా సెటైర్లు, విమర్శలు చేసే పూనమ్ కౌర్.. ఈసారి ఏకంగా ఆయన పేరును నేరుగా ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

తాజాగా పూనమ్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా త్రివిక్రమ్‌పై విరుచుకుపడ్డారు. “త్రివిక్రమ్ శ్రీనివాస్ మా కుటుంబంలో ఉన్న బలహీనతలను ఆసరాగా చేసుకుని దుర్వినియోగం చేశారు. వారితో బలవంతంగా కొన్ని స్టేట్‌మెంట్స్ ఇప్పించారు. కానీ ఆ వ్యవహారాలకు నేను ఏమాత్రం కట్టుబడి ఉండను. కొందరు రాజకీయ నాయకులు చేసే పనులకు, అరాచకాలకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబుదారీ కాదు. ఏదైనా పెద్ద సమస్య తలెత్తినప్పుడు మమ్మల్ని గాలికి వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు మా అవసరం ఉందనుకున్నప్పుడు, సహాయం కావాలన్నప్పుడు మమ్మల్ని వాడుకోవడం ఆయన చేసిన అత్యంత దుర్మార్గమైన చర్య” అంటూ పూనమ్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

ఇంత జరుగుతున్నా తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం (MAA – మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మౌనంగా ఉండటంపై పూనమ్ కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో చిన్న సమస్య వస్తే వెంటనే స్పందించే ‘మా’ అసోసియేషన్.. త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడి విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ఆమె ప్రశ్నించారు. “త్రివిక్రమ్‌ను ‘మా’ అసోసియేషన్ ఎందుకు నిలదీయడం లేదు? మీరంతా ఎవరి కోసం వేచి చూస్తున్నారు? ఆయన వల్ల ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు ఇలా నాశనం కావాలని మీరు కోరుకుంటున్నారు?” అంటూ పూనమ్ సంధించిన ఘాటు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో రాజకీయ పరిణామాల సమయంలోనూ, పంజాబీ వ్యవహారాలపైనా పూనమ్ కౌర్ పరోక్షంగా ట్వీట్లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ స్థాయిలో డైరెక్ట్‌గా పేరు పెట్టి విమర్శించడం, తన కుటుంబాన్ని వాడుకున్నారని ఆరోపించడం ఇదే తొలిసారి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే పూనమ్ ఇంతటి తీవ్ర ఆరోపణలు చేయడానికి దారితీసిన అసలు కారణం, ఆ రాజకీయ నాయకులు ఎవరు అనే విషయాలు ఇంకా సస్పెన్స్‌గానే ఉన్నాయి. ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై ఇటు దర్శకుడు త్రివిక్రమ్ గానీ, అటు ‘మా’ అసోసియేషన్ సభ్యులు గానీ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports