Last Updated:
Hyderabad:హైదరాబాద్ రోడ్లపై టూ వీలర్స్, ఫోరో వీలర్స్‌లో వేగంగా వెళ్లే వారికి గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఇక భారీ వాహనాలు, ట్రాలీలు, గూడ్స్ వెహికల్స్, అధిక లోడుతో రోడ్లపై తిరిగే లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలపై పరిమితికి మించిన బరువులు వేయడం, భారీ వస్తువులు, నిర్మాణరంగానికి అవసరమయ్యే ఐరన్, వుడ్, ఫర్నీచర్, సిమెంట్ ఇలాంటి వాటితో వెళ్లే వాహనాలు పక్కనే వెళ్లే టూ వీలర్స్ ప్రాణాలు తీస్తున్నాయి.
Hyderabad: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సగం వాహనదారుల నిర్లక్ష్యంతో మిగిలిన సగం భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణే హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన ఓ లారీలో ఓవర్ లోడ్ వేసుకొని వెళ్తుండగా యూ టర్న్ తీసుకునే సమయంలో లోపలున్న మెటల్ ఫ్రెమ్స్ పక్కనే వెళ్తున్న టూవీలర్ నడిపే వ్యక్తిపై పడింది. ఈదుర్ఘటనలో స్కూటర్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు వాహనదారులకు హెచ్చరిస్తున్నారు. అదనపు నిర్మాణాలు, అదనపు ప్రమాదానికి దారి తీస్తాయని..పరిమితుల్లోనే ఉండండి.. సురక్షితంగా డ్రైవ్ చేయమని సూచిస్తున్నారు.
హైదరాబాద్ రోడ్లపై టూ వీలర్స్, ఫోరో వీలర్స్‌లో వేగంగా వెళ్లే వారికి గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఇక భారీ వాహనాలు, ట్రాలీలు, గూడ్స్ వెహికల్స్, అధిక లోడుతో రోడ్లపై తిరిగే లారీలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలపై పరిమితికి మించిన బరువులు వేయడం, భారీ వస్తువులు, నిర్మాణరంగానికి అవసరమయ్యే ఐరన్, వుడ్, ఫర్నీచర్, సిమెంట్ ఇలాంటి వాటితో వెళ్లే వాహనాలు పక్కనే వెళ్లే టూ వీలర్స్ ప్రాణాలు తీస్తున్నాయి. హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు సజీవ సాక్షంగా మారింది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు అందరిని కలవరపెడుతున్నాయి.
Hyderabad, Balanagar🚨⚠️
Disturbing Visuals 🚨Overloaded Leyland Pickup after taking U turn rolled over…metal pipes probably tied on top metal frame, fallen on white Scooter Rider. Scooter rider no more…
Overloaded pickups beyond capacity reason for similar incidents more often…
@DriveSmart_IN @dabir @InfraEye
— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 8, 2026
లేలాండ్ పికప్ లారీ అధిక లోడుతో యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో బోల్తా పడింది. అంతే ఆ లారీలో తీసుకెళ్తున్న భారీ మెటల్ ప్రేమ్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల వాహనం టర్న్ అయ్యేటప్పుడు ఒక పక్కకు ఒరిగిపోయింది. లారీ పైనున్న మెటల్ ఫ్రేమ్‌కు కట్టి ఉన్న లోహపు పైపులు వక్కనే రోడ్డుపై వెళ్తున్న ఒక తెల్లని స్కూటర్ రైడర్‌పై పడ్డాయి. భారీ బరువు ఉన్న వస్తువులు మీద పడటంతో స్కూటర్ రైడర్ మృతి చెందారు. ఈఘటనలో పోలీసులు లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. యజమానిపై , డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
సామర్థ్యానికి మించి అధిక లోడుతో వెళ్తున్న పికప్‌లే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరగడానికి కారణమవుతున్నాయని నగర ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అనధికారిక అదనపు నిర్మాణాలు , అధిక బరువులు డ్రైవర్లు, ప్రయాణికులు , ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరిస్తున్నారు. పరిమితుల్లోనే ఉండండి.. ప్రాణాలను పణంగా పెట్టవద్దని .. సురక్షితంగా డ్రైవ్ చేయమని పోలీసులు ఈఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేసి విజ్ఞప్తి చేస్తున్నారు.














