స్పిరిట్ విషయానికొస్తే బాక్సాఫీస్ రికార్డుల రారాజు ప్రభాస్ తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందుతోంది. కాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా కనిపించనుంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 2027 మర్చి 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.














